ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ దగ్గర ప్రజలు తిరగబడ్డారు. జిల్లా అధికారులను తరిమి తరిమి కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
వివరాలు చూస్తే.. వికారాబాద్ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు అయింది. ఇక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు మీద కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులు గ్రామానికి చేరుకున్నారు. ఫార్మా కంపెనీ మాకు వద్దు అంటూ గ్రామస్తులు తిరుగుబాటు చేశారు. కొంతమంది గ్రామస్తులు ఆవేశంతో అధికారుల మీద దాడికి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి వెంకట్ రెడ్డి మీద రాళ్లు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ వాహనాలను స్థానికులు ధ్వంసం చేశారు. దీంతో ఉన్నతాధికారులను పోలీసులు అక్కడినుంచి వెనక్కి పంపించి వేశారు.
రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం దగ్గరే ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత రావడం చర్చనీయాంశం అయింది. ప్రభుత్వ అధికారుల మీద మూకుమ్మడి దాడికి దిగడం.. ప్రజల్లో వ్యతిరేకతకు గుర్తు అని అంటున్నారు.
Tension prevailed for a while in #Lagacharla village in #Dudyala mandal of #Vikarabad district on Monday after #farmers protest against land acquisition for pharma companies.
Collector Prateek Jain and #Kodangal Area Development Authority special officer Venkat… pic.twitter.com/mFk0mnx1VH
— NewsMeter (@NewsMeter_In) November 11, 2024