ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని ప్రజలే అనుకుంటున్నారని అవే మాటలు ఈటల అన్నారని ఆమె అన్నారు. ఆ మాటకు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తాడుముకున్నట్టు రేవంత్ రెడ్డి స్పందించడమేంటని ఆమె అన్నారు.కాంగ్రెస్, బీఅర్ఎస్ రెండు ఒకటేనని పలుమార్లు రుజువైందని, అదేమాట ఈటల చెబితే అంత రోషం ఎందుకని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఉద్యమకారుడు. బడుగు బలహీనవర్గాల నాయకుడిని ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ బీఅర్ఎస్ లోపాయికారీ ఒప్పందం గతంలో హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు ఎన్నికల్లో తేలిపోయిందన్న ఆమె…ఆపార్టీ ఢిల్లీలో లేదు గల్లీలోనూ లేదని అన్నారు.
కాంగ్రెస్ పై ఈటెల వ్యాఖ్యలు చేస్తే , బీఅర్ఎస్ ఎమ్మెల్సీ ఎందుకు స్పందించారని…అంటే రెండు పార్టీలు ఒకటేనని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలని ఆమె అన్నారు. భాగ్య లక్ష్మి ఆలయానికి వెళ్తున్న రేవంత్ రెడ్డి, తనకు ఓటుకు నోటు కేసులో సంబంధం లేదని, ఆ వీడియో లో ఉన్నది తాను కాదని కూడా ప్రమాణం చేస్తారా? అని అరుణ ప్రశ్నించారు.
ఈటల గురించి నోటికొచ్చింది వాగితే ఊరుకోం-బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని ప్రజలే అనుకుంటున్నారు : డీకేఅరుణ

Share: