ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి పేరుతో వివాదం రాజుకుంది. ఆమె చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఆమె మీద సస్పెన్షన్ వేటు పడింది రానున్న కాలంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా శాంతి ఎంపిక అయ్యారు విశాఖపట్నం జిల్లా అధికారిగా పోస్టింగ్ ఇచ్చారు అప్పటి వైసీపీ ప్రభుత్వంలో విశాఖ వ్యవహారాలు చూస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ఆమె సన్నిహితంగా మసులుకున్నారు దేవాలయ భూములను అన్యాక్రాంతం చేయడంలో శాంతి అప్పటి వైసిపి పెద్దలకు సహకరించాలని టాక్ ఉంది. అప్పట్లో ప్రభుత్వ వర్గాల్లో శాంతి ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచింది.
ఇప్పుడు ప్రభుత్వం మారడంతో శాంతికి కష్టాలు మొదలయ్యాయి గతంలో ఆమె చేసిన పనుల మీద ఎంక్వయిరీలు నడుస్తున్నాయి ఈలోగా ఆమె మొదటి భర్త ప్రెస్ మీట్ పెట్టి ..శాంతి పిల్లలకు తండ్రి ఎవరు అని తేల్చాలని పట్టుపట్టారు. ఎంపీ విజయసాయిరెడ్డి తో శాంతికి అక్రమ సంబంధం ఉందని బిడ్డలకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే అన్ని విషయాలు బయట పడతాయని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీని వెనక తెలుగుదేశం వర్గాలు ఉన్నాయనేది సుస్పష్టం.
ఇలాగ మీడియా ముందుకు వచ్చిన శాంతి ఈ ఆరోపణలను తిప్పి కొట్టింది. మొదటి భర్తతో వేధింపులు తాళలేక విడాకులు తీసుకున్నానని రెండో భర్త సుభాష్ రెడ్డితో జీవిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గిరిజన మహిళ కావడంతోనే తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఈలోగా టీవీ చానల్స్ కు కావలసినంత మేత దొరకడంతో .. ఈ అంశం మీద గంటలు తరబడి చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లి బిడ్డ సంబంధాల మీద రకరకాల కోణాల్లో విశ్లేషణలు చేసి జనం మీదకు వదులుతున్నారు అటు సోషల్ మీడియాలో కూడా శాంతి గతం, వర్తమానం, భవిష్యత్తు మీద వందల కొద్ది వీడియోలు తయారైపోయాయి.
ఇప్పుడు శాంతి మీద ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. ఆమె వ్యవహార శైలితో ప్రభుత్వానికి అప్రతిష్ట ఏర్పడిందని షోకాజ్ నోటీసు జారీ చేశారు. భర్తకు సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ ఆమె కు మెమో ఇచ్చారు.
ఆమె తీరుతో దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. ఆమెపై కొత్తగా ఆరు అభియోగాలు నమోదు చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే శాంతిపై వివిధ ఆరోపణలు రావడంతో ఈ నెల 2న సస్పెండ్ చేసి తొమ్మిది అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్ గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్తగా ఆరు అభియోగాలు మోపారు.
ఈ అభియోగాలకు సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు. విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పి,.
వేరొకరిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించడంపై ఓ అభియోగం మోపారు.
దేవాదాయశాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ రెండో అభియోగం మోపారు.
కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడటంపై మరో అభియోగం నమోదు చేశారు.
ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సర్.. మీరు పార్టీకి వెన్నెముక అని … ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గత ఏడాది మే 28న ట్వీట్ చేశారని, ఇది ఆ పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో పేర్కొన్నారు.
విశాఖపట్నంలో నివాసం ఉన్నప్పుడు అపార్ట్మెంట్లోని మరో ప్లాట్ లో నివాసితులతో గొడవపడగా, 2022 ఆగస్టులో అరిలోవ పోలీస్టేషన్ లో నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలని కోరారు.
శాంతికి అధికారం లేకపోయినా సరే .. పరిధి దాటి దుకాణాలు, భూముల లీజులను 3 ఏళ్లకు బదులు 11 ఏళ్లకు రెన్యువల్ చేసేలా కమిషనరు ప్రతిపాదనలు పంపడం, అవి రెన్యువల్ కావడంపై వివరణ కోరుతూ అభియోగం మోపారు . వీటన్నింటిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్నారు
ఇది ఇలా ఉంటే శాంతి సహాయ కమిషనర్ గా పని చేసినప్పుడు విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో ఇంకా ఏయే ఉల్లంఘనలకు పాల్పడ్డారు . భూములు, దుకాణాల లీజులలో ఏం చేశారు. ఆలయాల భూములు పరాయిపరం చేసేలా ఎన్వోసీల జారీకి సిఫార్సులు చేశారా అనేవి పరిశీలించేందుకు ముగ్గురు అధికారులతో కమిటీ వేయనున్నారు. దేవాదాయ శాఖ పరంగా శాంతి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.
శాంతి ఎపిసోడ్ లో ప్రభుత్వం దూకుడుగా ఉన్నది అన్న విషయం అర్థమవుతుంది ఈ మేటర్ లో విజయ సాయి రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు ఆయనకి వైసిపి మద్దతుగా ఉందా లేదా అనేది కూడా ప్రశ్నార్ధకమే. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో శాంతి మ్యాటర్ మరి కొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.