ఛత్రపతి శివాజీ గడ్డ మీద రాజకీయాల్లో పాల్గోవటం సంతోషంగా ఉందని
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు . ఈ ఒక్క మాట తో మహా రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోత మోగిస్తున్నారు. మరాఠాలకు ఇష్టమైన అంశాలను ఆయన ప్రస్తావిస్తున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే పక్షాల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగు వారి ప్రభావం ఉండే ప్రాంతాల్లో వరుసగా బహిరంగ సభ లు నిర్వహించి, ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరాఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో పవన్ పర్యటిస్తున్నారు. మొత్తంగా ఐదు బహిరంగ సభలు, రెండు రోడ్ షోలలో ఆయన పాల్గొంటున్నారు.
ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ పాత్ర అంతకంతకు బలపడుతోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ నమ్మకమైన మిత్రుడిలా బిజెపికి కనిపిస్తున్నారు. కీలక సమయంలో బిజెపి భుజం కాయడం ద్వారా అగ్ర నేతలకు మరింత దగ్గరవుతున్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో సైతం పవన్ కళ్యాణ్ మాట ఎక్కువ చెల్లుబాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శనివారం నాడు మరాఠ్వాడా ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. నాందేడ్ జిల్లా డెగ్లూర్, బోకర్, లాతుర్లలో సభల్లో మాట్లాడి.. రాత్రి షోలాపుర్ రోడ్ షోలో పాల్గొంటారు.
ఇక, ఆదివారం ..బల్లాపుర్ పట్టణం, కప్పా పెట్ నియోజవర్గం లో పర్యటిస్తారు. అనంతరం
పుణె కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోడ్డు షో నిర్వహిస్తారు.
ఇందులో చాలావరకు తెలంగాణ సరిహద్దుల్ని అనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రచారానికి స్పందన ఎక్కువగా కనిపిస్తోంది.
మహారాష్ట్ర ప్రచారం లో ఎక్కువ స్థానిక అంశాలను ఎంచుకొంటున్నారు. మరాఠా సంస్కృతి ని ప్రధానంగా బల పరుస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటనలో యువత బాగా సందడి చేస్తున్నారు. హిట్ అయిన సినిమా పాటల ట్యూన్స్ తో మోత మోగిస్తున్నారు.
మొత్తం మీద ఈ ప్రచారం హిట్ అవ్వడం ద్వారా,, ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ దళపతి స్థాయికి ఎదిగే అవకాశం కనిపిస్తోంది.