రేప్ కేసులో పాస్టర్ బాజేందర్ సింగ్…
తెలుగు నాట క్రైస్తవ పాస్టర్ల సేవల మీద చర్చ జరుగుతోంది. అత్యంత శాంతి సేవా కోరుకొనే వ్యక్తులు గా పాస్టర్ లను చిత్రీకరిస్తున్నారు. కానీ, వాస్తవం చూస్తే.. అనేక మంది పాస్టర్ లు తీవ్రమైన నేరాల్లో ఇరుక్కొన్నారు. కానీ, అవేమీ బయటకు రాకుండా దాచి పెడుతున్నారు.
….
అపర కోటీశ్వరుడు అయిన పాస్టర్ బాజేందర్ సింగ్ గుట్టు రట్టయింది. చర్చి ముసుగులో అనేక వందల మంది మీద అతను అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అపర కోటీశ్వరుడు కావడంతో బయటకు వచ్చేందుకు బాధితులు భయపడుతున్నారు. కానీ ఒక మహిళ చివరకు ధైర్యం చేయడంతో ఇప్పుడు బాజిందర్ సింగ్ బండారం బట్టబయలు అయింది.
……..
బాజిందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 2018లో పంజాబ్లోని జిరాక్పూర్ కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. విదేశాలకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి బాజిందర్ తనను శారీరకంగా వాడుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వీడియోలు రికార్డు చేసి, వాటిని బయట పెడతాను అని బ్లాక్మెయిల్ చేసే వాడని తెలియజేసింది. ఈ వీడియోలు సాయంతో వందలసార్లు తనపై అత్యాచారానికి బాజిందర్ సింగ్ పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.
దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ జరిపిన ట్రయల్ కోర్టు బాజిందర్ సింగ్ను దోషిగా తేల్చింది. బాజిందర్ సింగ్కు ఏప్రిల్ 1న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది.
………
కాగా బాజిందర్ సింగ్ తరచూ వివాదాల్లో ఉంటుంటాడు. ఇటీవల ఆయన తన కార్యాలయంలో ఓ మహిళపైన, మరో వ్యక్తిపైన దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిని చెంపలపై కొట్టడం, చేతికి ఏది దొరికితే అది విసరడం లాంటి దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ తర్వాత అనేకమంది మహిళలు బాజిందర్ సింగ్ అత్యాచారాల గురించి స్థానిక మీడియాకు వివరించారు.
…….
నిజానికి చర్చి ముసుగులో అనేక మంది పాస్టర్ లు ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారు, కానీ అవేమీ బయటకు రాకుండా తొక్కి పెడుతున్నారు. బాజిందర్ సింగ్ ఎపిసోడ్ తో పాస్టర్ ల అసలు స్వరూపం అర్థం అవుతుంది.