తమిళనాడులోని రామనాథపురం జిల్లా రామేశ్వరంలో బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలపై చర్చి పాస్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు. చర్చికి వచ్చే యువతులను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై జాన్ రాబర్ట్ అనే పాస్టర్ ను అరెస్టు చేశారు. రామేశ్వరంలో మండపం ప్రాంతంలోని పునీతర్ అరుళానంతర్ చర్చిలో జాన్ రాబర్ట్ పాస్టర్ గా పనిచేస్తున్నాడు. లైంగిక వేధింపులకు గురైన బాలికలు ఘటనపై ఫిర్యాదు చేసేందుకు చైల్డ్ వెల్ఫేర్ అధికారులను సంప్రదించారు. దీని ఆధారంగా అధికారులు జాన్ రాబర్ట్ పై విచారణ చేపట్టారు.
చర్చిలో పాస్టర్ గా పనిచేస్తున్న జాన్ రాబర్ట్ బాలికలను లైంగికంగా వేధించాడని విచారణలో నిర్ధారించిన అనంతరం చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పాస్టర్ పై మండపం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పాస్టర్ ను అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.