ఆగస్టు 14 అయిన ఈరోజు దేశ విభజన జరిగిన దినం.
నాటి సందర్భాన్ని భయానక ఘటనగా గుర్తు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ నెటిజన్లను, దేశపౌరులను ఆకట్టుకుంటోంది. ఆగస్టు 14 భయంకర జ్ఞాపకం అని ఆయన ట్వీట్ చేశారు. సామాజిక విభజన, అసమానతలను తొలగించి… ఏకత్వం, సామాజిక సామరస్యం, సాధికారత స్ఫూర్తిని బలోపేతం చేసుకోవాల్సిన సందర్భాన్ని దేశవిభజన ఘట్టం మనకు గుర్తు చేస్తూ ఉంటుందని ఆయన అన్నారు. అంతేకాదు నాటి భయానక స్థితిని ఎప్పటికీ మరిచిపోలేమని…లక్షలాదిమంది మన సోదరీసోదరులు నిరాశ్రయులయ్యారని ద్వేషం, హింస ఎంతోమంది ప్రాణాల్ని బలిగొందని ట్వీట్లో పేర్కొన్నారు. మనవారి పోరాటాలు, త్యాగాలు ఎన్నటికీ మరువలేమన్నారు మోదీ.

                                                                    



