అధికార టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంతో హుజూరాబాద్ లో ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరపున ఇవాళ మంత్రి హరీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ లో భారీ బైక్ ర్యాలీ సాగింది. అటు ఈటల కూడా కులసమీకరణాలపై దృష్టి పెట్టారు. హుజూరాబాద్ లో కుల సమ్మేళనం నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన అన్ని కులాల ముఖ్యులతో ఆయన సమావేశమయ్యారు.