పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ దర్యాప్తులో లోతుగా వెళ్లే కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. అర్పితా ముఖర్జీ తీసుకున్న 31 జీవిత బీమా(LIC) పాలసీల్లో నామినీగా మాజీ మంత్రి పార్థాచటర్జీ పేరు పెట్టారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
ఏపీఏ యూటిలిటీ సేవల కింద 2012, జనవరి 1 నుంచి ఇద్దరి మీద భాగస్వామ్యానికి సంబంధించిన దస్తావేజులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు.. ఈ భాగస్వామ్యం పేరు మీదనే పలు ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు వెల్లడించారు. అర్పితా గతంలో జార్ గ్రామ్ పట్టణానికి చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహం జరిగినా ఆమె భర్త పేరు వెల్లడించలేదు. భర్త నుంచి విడిపోయిన తర్వాత అర్పితా ఎవరితో రిలేషన్ షిప్లో ఉన్నారనేది వెల్లడించలేదు. ఈ పాలసీల్లో నామినీ బాగోతం వెలుగులోకి రావడంతో పార్థ చటర్జీతో అర్పితా సహజీవనం చేస్తుందని అనుమానిస్తున్నారు.