పరమతస్తుడితో కూతురు ప్రేమలో ఉందని తెలిసి ఆమెను తల్లిదండ్రులే హత్య చేశారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగకొండలో ఈ ఘోరం జరిగింది. మే 21న యువతి రక్తపు మడుగులో శవమై కనిపించగా…హత్యకు ఉపయోగించిన కత్తి ఉంది. నెలన్నర క్రితం ఆమె యువకుడితో పారిపోయినట్లు సమాచారం.ముస్లిం యువకుడి తోవెళ్లి పొరుగున ఉన్న మహారాష్ట్రలో తలదాచుకున్నట్టు తెలిసింది. అయితే కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు ఆమెను తిరిగి తీసుకొచ్చారు. నార్నూర్ ఇన్స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, రవికిరణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు.