ఆఫ్గన్ లో చాలా భాగం తాలిబన్ల వశమైనా పంజ్ షేర్ లోయలో రెబెల్స్ మాత్రం వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. పంజ్ షేర్ లో ఆధిపత్యం కోసం ఇరువర్గాల మధ్య బీకర పోరు సాగుతోంది. వందలాదిమంది సాయుధాలతో అష్టదిగ్బంధం చేస్తున్నా రెబెల్స్ ఫోర్స్ లొంగడం లేదు. పంజ్ షోర్ లోయ కాబూల్ కు ఉత్తరాన 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
తాలిబన్లతో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని పంజ్‌షీర్ ప్రతిఘటన దళ (ఎన్ఆర్ఎఫ్) కమాండర్ అమీర్ అక్మల్ తేల్చి చెప్పారు. ఓ వైపు శాంతియుత అవగాహనకు ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతూనే పెద్దఎత్తున సాయుధుల్ని పంపుతోంది. అటు పంజ్‌షీర్ మూడు వైపుల్నీ చుట్టేశామని తాలిబన్లు ప్రకటించారు.
అక్కడి తాజాస్థితిపై తాలిబన్ వ్యతిరేక దళాలు ఓ ట్వీట్ చేస్తూ… ‘ఖోర్సాసన్ ప్రజల విలువను అంగీకరించడమా లేదా ప్రతిఘటించడమా..ఈ రెండే మార్గాలున్నాయి’ అని స్పష్టం చేశాయి. గతంలో రష్యా సేనలను, తాలిబన్లను వీరోచితంగా పోరాడి ప్రతిఘటించిన ఇక్కడి పోరాట యోధులు వంద ఏళ్లకు పైగా ఆక్రమణల నుండి తమ లోయను కాపాడుకొంటూ వస్తున్నారు.
తనను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించుకున్న ఆఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్లా నలేహ్ మాట్లాడుతూ తాలిబన్లు భద్రతా బలగాలతో చేతులు కలిపి అర్థవంతమైన చర్చలు జరపాలని సూచించారు. అయితే పంజ్‌షేర్ దళాలధినేత అహ్మద్ మసూద్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.. చర్చల ద్వారానే తాలిబన్లను అడ్డుకోగలమని, యుద్ధం జరగడం తమకు ఇష్టం లేదనీ అన్నారు. గౌరవ మర్యాదలకు ఎటువంటి భంగం కలగకుండా లంగిపోయి, తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా మసూద్ యోచిస్తున్నట్టూ తెలుస్తోంది.
మా పాపులర్ రెసిస్టెన్స్ ఫ్రంట్‌లో చేరిన వారిలో ఎక్కువ మంది యువకులు, సైనికులు,మాజీ జిహాదీ కమాండర్లు ఉన్నారు. శాంతి చర్చలకు లేదంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని వారంటున్నారు.
హిందూఖుష్ పర్వత శ్రేణుల్లో పంజ్‌షిర్ లోయ ఉంది. పంజ్‌షిర్ (పంజ్‌షేర్) అంటే ఐదు సింహాలు అని అర్థం. ఇక్కడి జనాభా లక్షకు పైనే. చుట్టూ కొండలు, ఇరుకైన పర్వత శ్రేణులు, పంజ్‌షిర్ నదీ ప్రవహిస్తుంటాయి. ఈ లోయలోనే తజిక్ యుద్ధవీరులు ఉంటారు. అహ్మద్ షా మసూద్ లాంటి తజిక్ పోరాటయోధుల ఆధ్వర్యంలో సోవియట్ సైన్యాన్ని, తాలిబన్లను సైతం నిలవరించగలిగింది ఈ దళం. భీకర యోధులుగా వీళ్లకు పేరుంది. అయితే పాక్ వెన్నుదన్నులతో నడిచే తాలిబన్లను వీళ్లు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరు. షా మాసూద్ పంజ్‌షీర్ లోయను సోవియట్ వ్యతిరేక, తాలిబాన్ వ్యతిరేక కోటగా మార్చి ఇక్కడి ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. 1980 లలో మసౌద్ పలు సోవియట్ దాడులను, 1990 ల చివరలో తాలిబాన్లు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సందర్భాల్లో స్థానికులు అనేక వ్యూహాలతో ప్రతిఘటించారు. ప్రస్తుతం తొమ్మిదివేల మంది ఈ దళంలో ఉన్నట్లు తెలుస్తోంది.
మిలీషియా ఫైటర్లు, మాజీ ప్రభుత్వ సైనికులు పంజ్‌షీర్ లోయపై దాడి చేస్తారని ఊహించి…వాళ్లంతా ఇసుక బస్తాలతో మెషిన్ గన్లు, మోర్టార్లు, నిఘా పోస్ట్‌లు ఏర్పాటు చేసుకున్నారు. అమెరికా తయారు చేసిన హమ్వీస్, టెక్నికల్ మెషిన్ గన్ లను ట్రక్ లలో అమర్చుకొని ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నారు . ఇరుకైన దారులే ఆ ప్రాంతాన్ని కాపాడుతున్నాయని చెప్పవచ్చు. అయితే అంతర్జాతీయ సమాజం సహాయం లేకుండా, అష్టదిగ్బంధనంలో ఎన్నిరోజులు పోరాటం చేస్తుండగాలరన్నది ప్రశ్నార్థకం.