భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించింది పాకిస్తాన్ మీడియా. ఆయన నేతృత్వంలోనే భారత్ పులుకుబడి పెంచుకుంటోందని రాసుకొచ్చింది. అన్నిరంగాల్లో పెట్టుబడులకు భారతే అందరికీ స్వర్గధామంగా నిలుస్తోందని ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూట్ అనే డైలీలో కథనం వచ్చింది. ప్రముఖ్ రాజకీయ విశ్లేషకుడు షెహబాజ్ చౌధురీ ఈ వ్యాసం రాశారు. దేశ విదేశాంగ విధానం అద్భుతమని కొనియాడుతూ… దేశ డీజీపీ 3 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని చెప్పారు. మోదీవల్లే ప్రపంచదేశాల్లో భారత్ పేరు మార్మోగుతోందని గత పాలకులు ఎవరూ ఇలా పనిచేయలేదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో భారత్ తో పాటే స్వాతంత్ర్యం పొందిన పాకిస్తాన్ దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు షెహబాజ్. ఓ అణ్వాయుధ దేశం అడుక్కుతినే స్థితికి చేరడం సిగ్గుచేటన్నారు.