ఓవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటూ యాత్ర చేస్తుంటే మరోవైపు ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ మతబేధాలు సృష్టిస్తున్నారు.
ఢిల్లీలోని జామియా నగర్లో తయ్యబ్ మసీదు వెలుపల జమకూడిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్. దీంతో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి అక్షయ్ … ఆయన్ని వారించబోయారు. రెచ్చపోయి మాట్లాడుతున్న అతని దగ్గరకెళ్లి ఇక్కడ బహిరంగసభకు ఈసీ అనుమతి తీసుకున్నారా అని అడిగారు అక్షయ్. దీంతో మరింత రెచ్చిపోయిన ఆసిఫ్ పోలీసుపట్లా అనుచితంగా ప్రవర్తించాడు, బెదిరించాడు.
“సాలే తుజ్ జైసా కిత్నా పోలీస్ వాలా సిధా కర్ దియా” అంటూ భయపెడ్డాడు. అక్కడే ఉన్న కాంగ్రెస్ మద్దతుదారులూ ఒక్కసారిగా ఆ పోలీసుపై పడ్డారు. వాళ్లూ మరింత రెచ్చిపోయి ఈలలువేస్తూ, చప్పట్లు కొడుతూ … పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తూ హల్చల్ చేశారు. అంతేకాదు డిల్లీ పోలీసులు ముస్లిం ప్రాంతాల్లోని ప్రజలను దోచుకుంటున్నారనీ మండిపడ్డారు. ఇక్కడికిక్కడ నీ అంతు చూస్తాననీ బెదిరించిన వీడియో సైతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
రాబోయే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమార్తె ఆరిఫా ఖాన్ తరపున ప్రచారం చేస్తున్నాడు ఆసిఫ్ అహ్మద్ ఖాన్. 2019-2013 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు ఆసిఫ్.
ఇక విధుల్లో ఉన్న పోలీసును బెదిరించిన ఆసిఫ్ పై పోలీసులు కేసునమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు.
అయితే ఆసిఫ్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మతాల మధ్య చిచ్చురేపేలా అతని మాటలున్నాయని ఢిల్లీవాసులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసంగంలో అతను వాడిన ముస్లిం ప్రాంతంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అది చాలా సున్నితమైన ప్రదేశం. ఇక దేశరాజధానిలో ఇలాంటి సున్నితమైన ప్రాంతాలు ఇంకా ఉన్నాయి.
2018లో తిరంగా యాత్ర సందర్భంగా హిందూయువకుడు చందన్ గుప్తాను అక్కడిమూక హత్య చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ముస్లిం మెజారిటీలుంటే ప్రాంతం గుండా వెళ్లే సమయంలో భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలు చేస్తూ రెచ్చగొట్టడం ఏంటని కొందరు ఉదారవాదులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
భారత్ ను కలిపి ఉంచేందుకంటూ వాళ్ల నాయకుడు రాహుల్ యాత్ర పేరుతో నటిస్తూ ఉంటే వాళ్ల నాయకులు యధేచ్ఛగా వాళ్లపనులు వాళ్లు చేస్తున్నారని…దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
గతేడాది నవంబర్లోనూ షాహిన్ భాగ్ ప్రాంతంలో డ్యూటీలో ఉన్న నలుగురు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిపట్లా ఆసిఫ్ ఇలాగే ప్రవహిస్తూ ఏకంగా దాడి చేశాడు. ఆ దాడికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో అప్పుడూ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లని కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు ఆసిఫ్.
#WATCH | Maharashtra: ‘Pakistan Zindabad’ slogans were heard outside the District Collector's office yesterday in Pune City where PFI cadres gathered against the recent ED-CBI-Police raids against their outfit. Some cadres were detained by Police; they were arrested this morning. pic.twitter.com/XWEx2utZZm
— ANI (@ANI) September 24, 2022