పాకిస్తాన్ ప్రధాని అధికార నివాస,కార్యాలయాన్ని అద్దెకి ఇవ్వాలని కాబినెట్ సమావేశం లో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికిప్పుడు నగదు కొరత ఏర్పడడంతో గతి లేక ప్రధాని నివాసాన్ని అద్దెకి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నారు.
ఈ సంవత్సరం మొదట్లో దాదాపు 61 లక్జరీ కార్లని వేలం వేశారు వీటిలో వింటేజ్ కార్లు ఉన్నాయి. కార్లు అన్నీ మాజీ ప్రధానులు వాడినవి. ఇక ఆర్ధిక క్రమ శిక్షణ కోసం అంటూ రెండు కమిటీలని ఏర్పాటు చేసింది పార్లమెంట్ . పాకిస్థాన్ టీవీ చానెల్ సామా టీవి ఈ విషయాన్ని తెలిపింది.
2019 ఇమ్రాన్ ఖాన్ తన అధికార నివాసాన్ని ఖాళీ చేసి తనకు బని గాల లో ఉన్న ఇంట్లో ఉంటున్నాడు. ఇక రాష్ట్రాల గవర్నర్లు [ప్రావిన్స్ గవర్నర్లు ] అధికార నివాసాలలో కాకుండా వాళ్ళ ఇళ్ళలో ఉండాలి అంటూ ఆదేశాలు ఇచ్చారు ఇలా అన్నా ఖర్చు తగ్గించుకోవచ్చు అంటూ.
2019 లో పాకిస్తాన్ బ్రిగేడియర్ వసీం ఇఫ్తేకార్ కూతురు పెళ్లి కోసం అద్దెకి ఇచ్చారు దానికి ఇమ్రాన్ ఖాన్ కూడా హాజరు అయ్యాడు. పాకిస్థాన్ ప్రధాని అధికార నివాసానికి సంవత్సరానికి 470 కోట్ల పాకిస్తానీ రూపాయలు ఖర్చు అవుతున్నట్లు విద్యా శాఖ మంత్రి షఫాకత్ మెహమూద్ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకే ఖర్చు తగ్గించుకోవడానికి ప్రధాని నివాసం తో పాటు గవర్నర్ల నివాసాలని కూడా అద్దెకి ఇచ్చే ప్రతిపాదన ఉందని తెలిపాడు.
$6 బిలియన్ డాలర్ల ఖర్చు పెట్టి రష్యా నుండి S-400 సిస్టమ్ కొనడానికి సైన్యం ప్రతిపాదనలు ఇచ్చింది మరో వైపు విమానాలకి ఇంధనం నింపడానికి కూడా డబ్బులు ఉండవు కానీ తాలిబన్ల కి క్లోజెడ్ ఎయిర్ సపోర్ట్ మాత్రం ఇస్తున్నది సైన్యం. ఇవి దుబారా ఖర్చు కాదు సైన్యం దృష్టిలో. గాడిదలని చైనాకి ఎగుమతి చేసి అంతో కొంత సంపాదిస్తూ వెళ్ళ దీస్తున్న పౌర ప్రభుత్వానికి సైన్యం ఖర్చు మీద మాత్రం అదుపు లేదు అడగలేదు. ఇంకెన్ని విచిత్రాలు వింటామో రాబోయే రోజుల్లో!