పాకిస్తాన్ క్షిపణి ప్రయోగం విఫలమైంది. తొలుత ఈ క్షిపణిని గురువారం ఉదయం 11 గంటలకు సింధ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించాలని నిర్ణయించారు. అయితే, ట్రాన్స్పోర్టర్ ఎరెక్టార్ లాంచర్ (టీఈఎల్)లో వైఫల్యాన్ని గమనించి ప్రయోగాన్ని గంటపాటు వాయిదా వేశారు. తరువాత 12 గంటలకు క్షిపణిని పరీక్షిస్తే అది విఫలమై కుప్పకూలింది. పొగలు కక్కుతూ ఆకాశం నుంచి నేలపై పడడాన్ని సింధ్ ప్రావిన్స్ లోని జంషోరో వాసులు తెలిపారు.
క్షిపణిని పరీక్షించిన కాసేపటికే అది లక్షిత మార్గం నుంచి పక్కకు జరిగి సింధ్‌లోని థానా బులా ఖాన్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ఘటనపై ప్రభుత్వం మౌనం దాల్చినా కొన్ని స్థానిక మీడియా చానళ్లు మాత్రం ఈ వార్తను ప్రసారం చేశాయి.
భారత బ్రహ్మోస్ మిసైల్ తమ భూభాగంలోకి దూసుకెళ్లడంతో పాక్ దాన్ని వివాదం చేసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి తన శక్తిసామర్థ్యాలు ప్రదర్శించే ఉద్దేశంతో తాజాగా చేపట్టిన క్షిపణి ప్రయోగం విఫలమై కుప్పకూలింది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)