ఆప్గనిస్తాన్ లో తాజా దుస్థితికి కారణం పాకిస్తానేనని..ఆఫ్గన్ పాప్ స్టార్ ఆర్యానా సయీద్ ఆరోపించారు. తాలిబన్లకు పాకిస్థాన్ అండగా నిలుస్తోందని, దానికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు ఉన్నాయనీ అన్నారు.
తాలిబన్ల ఐడెంటిటీ పాకిస్తానేనని అన్నారు. తాను అందర్లాగే దేశంవిడిచి దోహా చేరుకున్నానని…అక్కడినుంచి ఇస్తాంబుల్ వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆఫ్గన్ ను వీడినందుకు సంతోషంగానే ఉన్నా..అక్కడి మహిళల పరిస్థితి తలుచుకుంటే ఏడుపొస్తోందని ఆమె అన్నారు. వాళ్ల ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్వల్ప కాలంలో దేశం మొత్తాన్ని తాలిబన్లు వశం చేసుకోవడం విస్మయపరిచిందన్నారు.
తమ దేశంలో శాంతి స్థాపన కోసం ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆఫ్గన్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని పాకిస్తాన్ నూ ఆమె కోరారు. ఈసందర్భంగా భారత్ ను కొనియాడిన ఆర్యానా సయీద్
భారత్ ఎప్పుడూ తమతో సఖ్యంగా ఉందని…నిజమైన స్నేహం భారత్ దేననీ అన్నారు. శరణార్థుల పట్ల భారత్ దయతో ఉందనీ కృతజ్ఞతతో చెప్పారు. వలసవస్తున్నవారికి అమెరికా
ఆశ్రయం కల్పిస్తుండడం సంతోషాన్ని కలిగిస్తున్నా….అక్కడున్న ప్రజల సంగతేంటని ఆందోళన వ్యక్తం చేశారు.