……..
పాకిస్తాన్ లో అంతర్గత తిరుగుబాటు జోరందుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక నగరాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. సైన్యం, ఐఎస్ఐ చేస్తున్న పిచ్చి పనులకు తాము బలి అవుతున్నామని పాకిస్తాన్ పౌరులు వాపోతున్నారు. మరోవైపు పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాలలో అంతర్గత తిరుగుబాట్లు ఊపందుకున్నాయి. పాకిస్తాన్ నాయకత్వం నుంచి విడిపోతామంటూ సాయిధ పోరాటానికి దిగుతున్నారు.
….
పాకిస్థాన్ సైన్యం ఒకేసారి నాలుగైదు కోణాల్లో పోరాడాల్సి వస్తోంది. ఒకవైపు భారత ఆర్మీ పాక్ మీద విరుచుకు పడుతుండగా, మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా దాడి చేస్తోంది.
బలూచిస్థాన్‌ను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకునే దిశగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ ,, ఇతర వేర్పాటువాద గ్రూప్‌లు అడుగులు వేస్తున్నాయి. తాము స్వాతంత్య్రం పొందామని బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి.
…..
భారత్‌పై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసేందుకు పాక్ సైన్యం ప్రణాళికలు రచిస్తుంటే.. బలూచిస్థాన్‌లో కీలక ప్రాంతాలపై బీఎల్ఏ పట్టు సాధిస్తున్నది. బాంబుదాడులు, బుల్లెట్లతో విరుచుకుపడుతూ అక్కడ గస్తీ కాస్తున్న పాక్ సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. మొత్తంగా ఇటు తూర్పు ప్రాంతమైన భారత్ నుంచి, అటు పశ్చిమ ప్రాంతమైన బలూచిస్థాన్ నుంచి జరుగుతున్న దాడులతో పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది.
………
ఒకరకంగా పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతున్నట్లే లెక్క.
. పాకిస్థాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ నుంచి తరిమికొట్టామని, క్వెట్టాను తమ ఆధీనంలోకి తీసుకున్నామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ జెండాలను తొలగించి, బలూచ్ జెండాలను ఎగురవేస్తున్న వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దానితో పాకిస్థాన్ మరోసారి రెండు ముక్కలు కానుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
.,..
దాదాపుగా పాకిస్తాన్ అంతట ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో మూడు నాలుగు చోట్ల తిరుగుబాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటిని ఎదుర్కోలేక పాకిస్తాన్ సైన్యం తల పట్టుకుంటోంది. అంతిమంగా పాకిస్తాన్ తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లు అవుతుంది.