పాకిస్తాన్ అసలు రంగు బయటపడింది. అడుక్కుని తెచ్చుకున్న ఐఎంఎఫ్ డబ్బులను కూడా .. ఉగ్రవాదం కోసమే ఖర్చు పెడుతున్నది. మొన్నటికి మొన్న అమెరికా చైనాల సహకారంతో ఐఎంఎఫ్ నుంచి వందల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చుకుంది. ఇప్పుడా డబ్బుల్ని ఉగ్రవాదులకి తలా కోటి రూపాయలు చొప్పున పంచేస్తోంది. దీనిని బట్టి పాకిస్తాన్ నిజస్వరూపం అర్థం చేసుకోవచ్చు
….
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ సర్వనాశనం చేసింది 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని పరలోకానికి పార్సిల్ చేసేసింది. పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరాలలో బహవల్ పూర్ ఒకటి. జేషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఆపరేషన్ కేంద్రం ఈ సిటీలోనే ఉన్నది. లాహోర్‌కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో బహవల్‌పుర్ ఉన్నది. . జామియా మజ్జీద్ లేదా ఉస్మాన్ అలీ క్యాంపస్ అని ఇక్కడ ఉగ్రవాద స్థావరాలను పిలుస్తుంటారు. ఇక్కడ ఉగ్రవాదుల్ని భారతదేశం కుక్కలని చంపినట్టు చంపేసింది. ఒకరకంగా చెప్పాలంటే ప్రధానమైన ఉగ్రవాద స్థావరాలు నాశనమయ్యాయి.
……….
ఈ దాడులను చూసిన యువత …కొత్తగా ఉగ్రవాదంలోకి చేరాలంటే భయపడే అవకాశం ఉంది. ప్రాణాల్ని పణంగా పెట్టి పనిచేయడం మీద ఆలోచన కలగవచ్చు. కానీ ఉగ్రవాద శిబిరాల్లో రిక్రూట్మెంట్ పెంచేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల వారసులకు కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించింది. అమరవీరులుగా గుర్తించి వారసులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
………..
ఉగ్రవాద నాయకులు ఇప్పుడు కోటీశ్వరులుగా మారిపోతున్నారు ఉదాహరణకి కరడు కట్టిన టెర్రరిస్టు మసూద్ అజార్ కు పరిహారం రూపంలో 14 కోట్లు,, సౌకర్యాలు రూపంలో ఐదారు కోట్లు అందే అవకాశం ఉంది అంటే మొత్తంగా 20 కోట్లు అతనికి అందజేస్తున్నారు.
వైమానిక దాడుల్లో తన సోదరి, ఆమె భ్తర్త, మేనల్లుడు.. అతని భార్య, మరదలు, మరో అయిదు మంది చిన్నారులు మరణించినట్లు మసూద్ అజార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు . మసూద్ అజార్ కుటుంబంలో ప్రస్తుతం అతనొక్కడే బ్రతికి ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో ప్రాణాలు కోల్పోయిన ఆ 14 మందికి అతనే వారసుడు కాబట్టి, పాక్ ప్రభుత్వం ఇచ్చే రూ.14 కోట్లు, సౌకర్యాల రూపంలో ఐదారు కోట్లు.. అతనికే దక్కుతాయని అంచనా వేస్తున్నారు.
…………
భారత్ లో సామాన్య ప్రజల్ని చంపడం కోసం.. పాకిస్తాను వందల కోట్లు ఖర్చు పెడుతోంది అని అర్థం అవుతోంది. కానీ అటువంటి పాకిస్తాన్ కు నీళ్లు అందడం లేదని,, సింధూ నదీ జలాలు వెంటనే వదలాలని మన భారతీయ కమ్యూనిస్టు పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నాయి. అంటే మనం సామాన్య ప్రజల్ని చంపించే పాకిస్తాన్ కోసం గుండెలు బాదుకొంటున్న కమ్యూనిస్టుల నిజస్వరూపం... తేలికగా అర్థం చేసుకోవచ్చు.