హిందువులు ఆయుధాలు సేకరించి పెట్టుకోవాలంటూ ఉత్తరాఖండ్ లో సాధువు నర్సింహానంద్ సహా ఇతర హిందూసంస్థల నాయకుల ప్రసంగాలు వైరల్ అవడంతో వారిమీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.వాళ్ల ప్రసంగాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని… మారణహోమాన్ని ప్రేరేపించేలా ఉన్నాయని వామపక్ష, సెక్యులర్ వాదులు చేస్తున్న ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమంలో నర్సింహానంద్ ఈ వ్యాఖ్య చేశారు. ఫిర్యాదులను స్వీకరించి, ఐపిసి సెక్షన్ 153A (మత ప్రాతిపదికన వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. డిసెంబర్ 17న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో 3 రోజులపాటు ధర్మసంసద్ కార్యక్రమాలు జరిగాయి.
జితేంద్ర నారాయణ్ త్యాగి సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది్.
AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఫిర్యాదుతో ఆగని అసద్… పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. నిందితులపై చర్యలు తీసుకోకుంటే… రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఒవైసీ పోలీసులనే కాదు.. హిందువులను బెదిరిస్తున్న ప్రసంగ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నేను పోలీసులకు చెప్పాలనుకుంటున్నా… గుర్తుంచుకోండి. యోగి ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండలేడు… మోదీ ఎప్పటికీ ప్రధానిగా ఉండరు. సమయం కోసం చూస్తూ… ముస్లింలమైన మేం మౌనంగా ఉన్నాం, కానీ మీరు చేసే పనుల్ని మరచిపోలేమని గుర్తుంచుకోండి. మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తుంచుకుంటాం. అల్లా తన శక్తితో మిమ్మల్ని నాశనం చేస్తాడు, ఇన్షా అల్లా. మేము గుర్తుంచుకుంటాం. ఎప్పడూ కాలం మీది కాదు..మా సమయం వచ్చినప్పుడు.. మిమ్మల్ని రక్షించడానికి ఎవరు వస్తారు…. యోగి తన మఠానికి వెళ్తాడు, మోదీ హిమాలయాలకు వెళ్తాడు… అప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఎవరు వస్తారు. గుర్తుంచుకోండి, మేము మరచిపోం.” అంటూ హెచ్చుస్వరంతో బెదిరించాడు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే ధర్మ సంసద్‌లో హిందూ ప్రతినిధులు రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని ఓవైసీ ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన చేసిన ఈ రెచ్చగొట్టే ప్రసంగానికి ఒవైసీపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. డిసెంబర్ 12న కాన్పూర్‌లో ఒవైసీ ఈ విద్వేష ప్రసంగం చేసినట్టు తెలిసింది.
https://twitter.com/asadowaisi/status/1474020370197798929?s=20
https://twitter.com/nanditathhakur/status/1474217149526855708?s=20