దేశం కోసం,ధర్మం కోసం పని చేయాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు అయినదే జై హింద్ టీమ్. జాతీయ వాద భావాలు కలిగిన కొందరు మిత్రులు … ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక సమూహంగా ఏర్పడి సేవా కార్యక్రమాలకు చొరవ తీసుకున్నారు దీనికి వేదికగా జైహింద్ సోషల్ మీడియా గ్రూపు ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నారు. ఈ గ్రూప్ 2018 లో ఏర్పాటు అయింది.
ఈ గ్రూప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతూన్నారు.
ఈ గ్రూప్ లో ఉన్నవారు నిస్వార్ధంగా తమకి తోచిన విధంగా దేశ సేవ చేయాలి అని దృడసంకల్పంతో ఉన్నవారే.
సమాజములో ఉన్న వ్యక్తుల్లో దేశభక్తి పెంపొందించడం,సనాతన సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు.
ఇప్పటిదాకా ఎంతోమందికి అత్యవసర సమయంలో రక్తాన్ని అందించారు. కరోనా సమయంలో సింగల్ డోనర్ ప్లేట్లెట్స్ అవసరమైనప్పుడు ఈ గ్రూపులో ఉన్న సభ్యులు స్పందించారు.
అత్యవసర సమయాల్లో ఎంత దూరమైనా వెళుతూ రక్తాన్ని అందిస్తున్నారు . రక్తాన్ని అందించడం మన బాధ్యత అంటూ చుట్టూ ఉన్న వారిని జాగృతం చేస్తూంటారు.
జై హింద్ గ్రూప్ నుండి మరో బృహత్తర కార్యక్రమం ఇంటింటికి భగవద్గీత. ఇప్పటివరకు సుమారు 1500 కుటుంబాలకు భగవద్గీతని అందించడం జరిగింది.
డిసెంబర్ 31 రోజు అనవసర ఖర్చులు చేస్తున్నారు అనే ఆలోచనతో వాటి ఖర్చులకు బదులు హిందువులకి భగవద్గీత అందించాలి అని నిర్ణయించుకున్నారు. 2022 జనవరి 9వ తేదీ ఇంకోటి ఏకాదశి సందర్భంగా దీనిని ప్రారంభించారు. ఇంటింటికి భగవద్గీత గ్రంథాలను జైహింద్ సమూహం దిగ్విజయంగా ముందుకు సాగిస్తున్నది.
వివాహాది శుభకార్యాలలో,గృహ ప్రవేశాలు,పుట్టిన రోజు వేడుకలకి మరియు ఇతర కార్యక్రమాల్లో భగవద్గీతను అందిస్తున్నారు .
అత్యవసర సమయంలో ఎవరైనా ఇబ్బంది పడ్డ సందర్భంలో ఎంతోకొంత నిధులు సమకూర్చి వారికి చేదోడు వాదోడుగా నిలిచిన సందర్భాలు కోకొల్లలు.
ఇటీవల నిర్మల్ జిల్లాకు చెందిన తాండూరు మండలంలోని బెల్ తరోడ గ్రామంలో ఒక చిన్నారి.. తల్లిని కోల్పోయి అనాధగా మారడంతో దహన సంస్కారాలకు ఇబ్బంది పడింది. జై హింద్ గ్రూప్ సభ్యులు ,ఇతరులు ఆర్థిక సహాయం చేయడంతో అమ్మాయి పేరు మీద జై హింద్ & సేవాభారతి ఆధ్వర్యంలో 1,01,515 రూపాయిలు ఫిక్స్ డిపాజిట్ చేయడం జరిగింది.
ఇలా అనేక రకాల కార్యక్రమాలతో ఈ గ్రూపు ముందుకు వెళుతోంది.
పిల్లల్లో దేశభక్తిని, నైతిక విలువలను, క్రమశిక్షణను అందించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. దేశము కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల పుస్తకాలను పిల్లలకి అందిస్తున్నారు.
పర్యావరణ ప్రాముఖ్యతను కూడా వివరిస్తూ , మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలు చేపడ్తున్నారు.
ఎలాంటి స్వార్థం లేకుండా తాము చేసే పనిలో అలసట అనేది లేకుండా ఈ గ్రూప్ సభ్యులు ముందుకు సాగుతున్నారు.
ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్న జై హింద్ సమూహన్ని పలువురు అభినందిస్తున్నారు.