ఆఫ్గనిస్తాన్ నుంచి తమ బలగాల ఉపసంహరణను మరోసారి సమర్థించుకున్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన బైడెన్.. ఆఫ్గన్ నుంచి తమ సైన్యం వైదొలుగుతుండడంపై ఇతర దేశాల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఆఫ్గన్ల సంక్షేమం , ప్రయోజనం కోసం పనిచేయడమా, వద్దాఅనేది తాలిబన్లే తేల్చుకోవాలని హితవుపలికారు.