భారత ప్రధాన న్యాయమూర్తిని ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఓయూ డాక్టరేట్ ను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చాన్సలర్ హోదాలో జస్టిస్ ఎన్ వీ రమణకు అందజేశారు. సీజేఐ రమణ ఈనెల 26న పదవీ విరమణ కానుండగా ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది. దేశంలోని ఉన్నత విద్యలో కొత్త శకాన్ని సృష్టించి.. ఆధునిక భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యమైన ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది మేధావులను తయారు చేసిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఓయూ హాస్టళ్లు, క్యాంటీన్, గ్రంథాలయాల్లో స్నేహితులతో కలిసి గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు.
పీవీ నరసింహారావు వంటి ప్రధాని, కేసీఆర్ లాంటి సీఎం సహా మంత్రులు, నేతలను ఓయూ అందించిందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్ లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి 42 మంది సరసన… ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని జస్టిస్ రమణ అన్నారు.