……….
ఆపరేషన్ సింధూర్..! ప్రపంచానికి భారతదేశం సత్తాను చాటి చెప్పిన మిలటరీ ఆపరేషన్. ఒక్క గంటలో పాకిస్తాన్ అహంకారాన్ని అతలాకుతలం చేసేసింది. కళ్ళు మూసి తెరిచేలోగా 100 మంది పైగా ఉగ్రవాదుల్ని పరలోకానికి పార్సెల్ చేసేసింది.
………
ఆపరేషన్ సింధూరితో సాధించిన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైన టాప్ టెన్ లాభాలను ఇప్పుడు చూద్దాం.
1)) ఉగ్రవాద స్థావరాలు సర్వ నాశనం::
పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలోని ముఖ్యమైన ప్రాంతాల్లో అంటే శత్రువు గుండెల మీద దాడి చేయించాం. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్ తుడిచి పెట్టేసింది.
2. పాకిస్తాన్ ప్రధాన భూభాగం లోపలికి వెళ్ళి మరీ దాడులు
భారతదేశం తన దాడుల పద్ధతిని, నియమాలనూ మార్చేసింది. పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోకి సైతం చొచ్చుకుపోయి దాడి చేసింది. పాకిస్తాన్ మిలటరీకి బలమైన కేంద్రంగా ఉన్న పంజాబ్ ప్రొవిన్స్‌లోని లక్ష్యాలను కూడా భారత్ ఛేదించింది. పాకిస్తాన్‌లోని ప్రతీ అంగుళమూ తమకు అందుబాటులోనే ఉందని భారత్ తన దాడుల ద్వారా యావత్ ప్రపంచానికీ నిరూపించింది.
3. ఒక తప్పు కి పది దెబ్బలు:
పహల్గామ్ ఉగ్రదాడికి స్పందించిన తీరు భారతదేశ కార్యాచరణ విధానంలో వచ్చిన సైద్ధాంతిక మార్పుకు నిదర్శనం. మీరు ఒక తప్పు చేస్తే ఈ పది సార్లు శిక్షిస్తామని.. గూబ గుయ్ అనిపించి వచ్చారు.
4. ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు::
కరుడు కట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని భారత్ చంపేసింది హడావిడిలో అంత్యక్రియలకు సైనిక అధికారులు యూనిఫాములతో హాజరయ్యారు. దీంతో పాకిస్థాన్ లో ఉగ్రవాదులు సైన్యం ఒకటే అని స్పష్టంగా తేలిపోయింది.
5. పాకిస్తాన్ సైనిక వ్యవస్థలో బలహీనతలు::
పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ గ్రిడ్‌ను భారత బలగాలు విజయవంతంగా ఛేదించగలిగాయి. పాక్ సైనిక వ్యవస్థ ఒట్టి డొల్లే అని ప్రపంచానికి చాటిచెప్పాయి.
6. భారతదేశపు దృఢమైన ఎయిర్ డిఫెన్స్ సంసిద్ధత ప్రకటన:
అద్భుతమైన టెక్నాలజీ తో కూడిన సైనిక పాటవాన్ని భారత్ ప్రదర్శించింది. పాకిస్తాన్ మోహరించిన చైనీస్ తయారీ రక్షణ వ్యవస్థలను భారత్ విజయవంతంగా ఛేదించింది. వందల కొద్దీ పాకిస్తానీ డ్రోన్స్‌ను, క్షిపణులను ధ్వంసం చేసింది.
7. అంతర్జాతీయంగా ప్రశంసలు
పాకిస్తాన్‌లోని కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. భారత్ కేవలం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అంటే ఉగ్రవాదాన్ని సహించబోము అనే పద్ధతిని అనుసరించింది. దీంతో భారతదేశం దాడులని ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయి.
8. ముఖ్యులైన ఉగ్రవాదుల నిర్మూలన:
భారతదేశపు ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో ఉన్నవారు సహా ఎంతోమంది భయంకరమైన ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఒక్క రాత్రిలో పలు ఉగ్రవాద సంస్థల నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.
9. పాకిస్తాన్ మిలటరీ వ్యవస్థ కకావికలం:
భారత్ చేపట్టిన సైనిక చర్య.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక అణ్వస్త్ర దేశపు వైమానిక శిబిరాలను ధ్వంసం చేయటం. దీంతో అక్కడ సైన్యం మీద పాకిస్తాన్ ప్రజలకే నమ్మకం పోయింది.
10. ప్రపంచానికి సందేశం:
భారతదేశం తన ప్రజల రక్షణ కోసం ‘ఎవరి అనుమతి కోసమూ ఎదురు చూడదు’ అని ప్రపంచానికి చాటింది. ‘ఉగ్రవాదానికి శిక్ష వేసి తీరుతాం – ఎప్పుడైనా, ఎక్కడైనా’ అని నిరూపించింది.
……
ఆపరేషన్ సింధూర్ తో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దురదృష్టం ఏమంటే కమ్యూనిస్టులు కుహనా సెక్యులరిస్టులు మాత్రం ఈ విజయాన్ని ఒప్పుకోవడం లేదు. ఇందిరా గాంధీని, నరేంద్ర మోదీ ని పోల్చుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు.