ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంతం పడితే ఎలా ఉంటుందో.. పాకిస్తాన్ కి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. ఒకవైపు సైన్యంతో విరుచుకుపడుతూనే మరోవైపు ఆర్థిక ఆంక్షల ద్వారా.. పాకిస్తాన్ ని ఇరికించేశారు. మరోవైపు పాకిస్తాన్ కి నీళ్లు అందకుండా.. గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈ స్కెచ్ పూర్తి అయితే పాకిస్తాన్ ప్రజలు.. నీళ్ల కోసం తమలో తాము కొట్టుకుంటారు.
……
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు
నిశ్శబ్దంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని నదీ జలాల మీద.. వేగంగా పనిచేస్తోంది. పాకిస్తాన్ వైపు ప్రవహించే అన్ని నదుల మీద కట్టడి ని తీవ్రతరం చేస్తోంది. జమ్ముకశ్మీర్‌లో నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారు. జమ్ములోని రాంబన్‌లో చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ జలాశయం నుంచి నీటి సరఫరాను భారత్ నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్సుకు నీరు అందడం లేదు. భారత్ మీద రగిలిపోయే బ్యాచులన్నీ పంజాబ్ ప్రావిన్స్ లోనే ఉంటాయి. ఇప్పుడు ఈ ముఠాలకు నీటి ఎద్దడిని రుచి చూపిస్తున్నారు.
…..
మరో వైపు, జీలం నదిపై ఉన్న కిషన్‌గంగ జలాశయం నుంచి కూడా నీటిని అడ్డుకొంటున్నారు. ఈ నది జలాలు పాక్‌కు వెళ్లనివ్వకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది. అలాగే బాగ్లిహార్, సలాల్ డ్యామ్‌లలో పూడికతీత పనులను భారత్ చేపట్టింది. ఈ ప్రాజెక్టులను నిర్మించిన తర్వాత పూడికతీత పనులు చేపట్టడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఇలాంటి చర్యలపై పాకిస్థాన్ అభ్యంతరం చెప్పేది.
కానీ ఇప్పుడు భారత్ నేరుగా .. డ్యాంల నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచుతోంది. తద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారత్ పెంచుకునే వీలు ఉంటుంది. అటు పాకిస్తాన్ కు నీళ్లు ఆగిపోతాయి.
….
జమ్మూ కాశ్మీర్లో భారీ భద్రత మధ్య ఇంజనీరింగ్ నిపుణులు .. ఈ ఆపరేషన్ ను చేపట్టారు. సరిహద్దు ప్రాంతాలలో కీలకమైన ప్రాజెక్టులు అరడజను కంటే ఎక్కువగా ఉన్నాయి. వాటిలో కూడా ఇదే విధంగా పూడికతీత పనులు భారత్ చేపడితే పాకిస్థాన్‌కు నీరు వెళ్లడం పూర్తిగా తగ్గిపోతుంది. పాకిస్థాన్‌లో వ్యవసాయ రంగం 80 శాతం సింధూ నదీ జలాలపైనే ఆధారపడుతోంది. దీంతో పాకిస్తాన్ పంట పొలాలు ఎండిపోవడం ఖాయం.
…
పాకిస్తాన్లో ఉగ్రవాదులు సైన్యం కలిసి పిచ్చి వేషాలు వేస్తున్నారు. 70 సంవత్సరాలుగా ఈ తలనొప్పి భరిస్తున్న భారతీయ సమాజం.. ఇప్పుడు తగిన బుద్ధి చెప్పడం ఖాయం. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి అణిచివేయడం అంతే ఖాయం.