Operation sindoor || భారత్ వ్యూహాత్మక అడుగులు..
……….
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విశ్వరూపాన్ని చూపించారు. భారతదేశాన్ని బోల్తా కొట్టించాలి అన్న కుట్రను బట్ట బయలు చేశారు. పాకిస్తాన్ చైనా సంయుక్తంగా వేసిన ట్రాప్ లో పడకుండా… జాగ్రత్తగా దేశాన్ని ముందుకు నడిపించారు. ఆవేశాలకు పోకుండా ఆలోచనతో మోడీ తీసుకున్న నిర్ణయం.. అంతర్జాతీయ వ్యూహకర్తలతో శభాష్ అనిపిస్తున్నది.
…………….
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలతో అన్ని దేశాలు ఆర్థికంగా తలడిల్లి పోతున్నాయి. ఈ సంక్లిష్ట సమయంలో కూడా మెరుగైన వ్యవస్థతో ముందుకెళుతున్నది భారతదేశం మాత్రమే. ఇది చూసి కుళ్ళుకుంటున్న పాకిస్తాన్ చైనా సంయుక్తంగా ఒక ట్రాప్ వేశాయి. ఉగ్రవాద దాడులతో భారత్ ను రెచ్చగొట్టేందుకు పహల్గాం దాడిని ఉపయోగించాయి. ఈ దాడి ద్వారా భారత్ యుద్ధరంగంలోకి దూకాలి అన్నది వాళ్ల ప్రయత్నం. అనేక నెలలపాటు యుద్ధం సాగాలి అని కుట్ర పన్నారు.
……….
యుద్ధం ద్వారా జరిగే పరిణామాలు ఇప్పుడు చూద్దాం. చిప్ప చేత పట్టుకుని కూర్చున్న పాకిస్తాన్ కి పోయేదేమీ లేదు. నెత్తి మీద మరింత అప్పుల కుప్ప తయారవుతుంది అంతే. కానీ భారతదేశము మరోసారి ఆర్దిక సంక్షోభంలోకి కూరుకొని పోతుంది. చైనాకు కావాల్సింది కూడా అదే. ఆసియా దేశాల్లో చైనా మాత్రమే బాగుండాలి. భారత్ సహా మిగిలిన దేశాలు ఆర్థికంగా చితిక పోవాలి. అప్పుడు మాత్రమే చైనా మాట చెల్లుబాటు అవుతుంది.
….
ఇక్కడే పాకిస్తాన్ చైనా మిత్ర బంధం గురించి కూడా తెలుసుకోవాలి.
కమ్యూనిస్టు చైనా దేశం పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలు కి … నూటికి నూరుపాళ్ళు మద్దతు ఇస్తోంది. భారత్- పాకిస్థాన్ వివాదంలో నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ ఇషాక్ దర్ చైనాకు చెందిన తన కౌంటర్పార్ట్ వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు. వీరిద్దరి మధ్య టెలిఫోన్ సంభాషణలు సుదీర్ఘంగా సాగినట్లు తెలుస్తోంది. ఒక వైపు ప్రపంచ దేశాలు అన్నీ బాధిత దేశమైన భారత్కు మద్దతుగా నిలుస్తుంటే.. చైనా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కుట్రదారు పాక్కు వత్తాసు పలుకుతోంది. తాజాగా తమ మిత్రరాజ్యమైన పాకిస్థాన్ సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలను కాపాడేందుకు తాము అండగా ఉంటామని ప్రకటించి తన వక్రబుద్ధిని మరోసారి బహిరంగ పరచుకుంది.
……
మరోవైపు ఉగ్రవాదులకు చైనా బహిరంగంగా మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులు చైనాకు చెందిన ఫోన్లు, ఇతర సామాగ్రిని వాడినట్లు నిఘా వర్గాలు తేల్చేశాయి. ఉగ్రవాదులు చైనీస్ యాప్స్ ద్వారానే కమ్యూనికేషన్ జరిపినట్లు సమాచారం. ఈ మేరకు పహల్గాంలో ముష్కరులు కాల్పులు జరిపిన చోట చైనీస్ శాటిలైట్ ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో చైనా సాయంతోనే పాకిస్తాన్ ఉగ్రదాడి జరిపినట్లు అంచనా వేస్తున్నారు
……..
ఈ విషయాలను పసిగట్టిన మోదీ ప్రభుత్వం తెలివిగా వ్యవహరించింది. అమెరికాను ముందు పెట్టి యుద్ధం ట్రాప్ నుంచి పక్కకు తప్పుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ బఫూన్ అయితే,, చైనా పెద్ద బపూన్ గా నిలుస్తోంది. అంతిమంగా యుద్ధం బెడద ను తప్పించడం మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన ఘనత కూడా మోదీకి దక్కుతోంది.