ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ కావడంతో పాకిస్తాన్ రగిలిపోతోంది. భారత్ మీద యుద్ధం చేసేస్తామంటూ అవాకులు, చవాకులు పేలుతుంది. ఇంకేముంది,, పాకిస్తాన్ యుద్ధంలోకి దిగితే భారత్ కి నష్టం కలుగుతుంది అంటూ ఇక్కడ ఉన్న దేశద్రోహులు కమ్యూనిస్టులు గుండెలు బాదేసుకొంటున్నారు . పాకిస్తాన్ కు కొంచెం కూడా బాధ కలిగించకూడదు అంటూ కామ్రెడ్లు.. వీడియో ప్రకటనలు విడుదల చేస్తున్నారు. పాకిస్తాన్ కి కోపం వస్తే భారత్ తట్టుకోలేదు అన్న తరహాలో కలరింగ్ ఇస్తున్నారు.
……….
ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. భారత్ ,, పాకిస్తాన్ ..రెండు దేశాలు ఆయుధాలను ఇతర దేశాల నుంచి కొంటాయి. కొంతమేర మాత్రమే సొంతంగా తయారు చేసుకుంటాయి. అందుచేత రెండు దేశాల దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి లెక్కలు స్పష్టంగా తెలుసుకోవచ్చు.
…….
భారత్ పాకిస్తాన్ సైనిక బలగాల వివరాలు ఒకసారి చూస్తే,, పరిస్థితి అర్థం అయిపోతుంది.
1) భారతదేశంలో రక్షణ బడ్జెట్ ఏడాదికి 6.8 లక్షల కోట్ల రూపాయలు కాగా పాకిస్తాన్ బడ్జెట్ కేవలం లక్ష కోట్లు మాత్రమే. పైగా పాకిస్థాన్ దగ్గర ఇప్పుడు ఏమాత్రం డబ్బులాడని పరిస్థితి.
2) భారతదేశం దగ్గర 14.5 లక్షల సైనిక జవాన్లు ఉన్నారు. మరో పదకొండున్నర లక్షల మంది రిజర్వు బలగాలు ఉన్నాయి. కానీ పాకిస్తాన్ దగ్గర తిప్పి కొడితే మొత్తం ఆరున్నర లక్షల మంది కనిపిస్తున్నారు.
3) భారతదేశం దగ్గర నాలుగు వేలకు పైగా యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. భారీ సంఖ్యలో శత్రుఘ్నులు,, క్షిపణులు అందుబాటులో ఉన్నాయి. పాకిస్తాన్ కు కేవలం రెండున్నర వేలు యుద్ధ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి.
4) భారతదేశ సాయుధ శకటాలు ఒకటిన్నర లక్షల కాగా పాకిస్తాన్ శకటాలు కేవలం 17న్నర వేలు మాత్రమే. ఇక రెగ్యులర్ తుపాకులు, బాంబులు, స్కడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
5) భారతదేశం దగ్గర 500 పైగా ఫైటర్ జట్లు,, 200 రవాణా విమానాలు ఉన్నాయి. మొత్తం యుద్ధ విమానాలు 2, 000 పైనే. పాకిస్తాన్ దగ్గర అన్ని కలిసి 13 వంధల లోపు ఉంటాయి.
6) నౌకా దళం లోనూ అంతే. భారతదేశానికి 18 జలాంతర్గాములు ,, 13 విధ్వంసక నౌకలు ఉన్నాయి. మొత్తం 300 దాకా యుద్ధనౌకలు భారత్ కు ఉంటే పాకిస్తాన్ దగ్గర కేవలం 120 మాత్రమే కనిపిస్తున్నాయి.
……..
అణ్వాయుధాలు విషయంలో మాత్రం భారతదేశంతో, పాకిస్తాన్ పోటీపడుతుంది. రెండు దేశాల దగ్గర సమానమైన సంఖ్యలో అణ్వాయుధాలు కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలు అణు బాంబులు ప్రయోగించుకునే సాహసం చేయకపోవచ్చు. పైగా పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు, జవాన్లు ఎంతవరకు నిలబడతారు అనేది కూడా అనుమానమే. ఇప్పటికే సైన్యం నుంచి చాలామంది జంప్ అయిపోయినట్లు తెలుస్తోంది.
…….
దీనిని బట్టి పాకిస్తాన్ పిచ్చివాగుడిని అర్థం చేసుకోవచ్చు. మొదటినుంచి ధైర్యంగా ముందుకు వచ్చి,, యుద్ధంలో గెలిచిన ట్రాక్ రికార్డు పాకిస్తాన్ కు లేదు. అయితే ఉగ్రవాదులను ఉసిగొలిపి, భారతదేశంలో బాంబులు పెట్టించి దాడులు చేయించడం మాత్రమే పాకిస్తాన్ కు అలవాటు. ఇప్పుడు కూడా అదే తరహాలో దొంగ చాటుగా దెబ్బతీసేందుకు పాకిస్తాన్ ప్రయత్నించే అవకాశం ఉంది. అంతకుమించి ప్రత్యక్షంగా యుద్ధం చేసే సత్తా కానీ సాహసం కానీ పాకిస్థాన్ కు లేదు అనేది స్పష్టం.