ఆదిలాబాద్ లోని రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించి రామాయి రాంపూర్ రైతులకు న్యాయం చేయాలని లేదా భూములు వెనక్కి ఇప్పించాలని ఎస్టీ రైతుల తరపున నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంత నాయక్, బీసీ రైతుల తరుపున బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారికి, గనులు, భూగర్భ శాఖ ఎండీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి. నాలుగేళ్ల కిందట జీవో నెంబర్ 40 ఇచ్చి, రైతులను మభ్యపెట్టి అతి తక్కువ ధరకు భూములు తీసుకున్నారని ఇంతవరకు , సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించలేదని ఆమె అన్నారు. వాళ్లకు ఉద్యోగాల ఆశ పెట్టి, స్థలాలు ఇస్తామన్నారని..మీకు నేనున్నానని జోగు రామన్న నాడు భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. భూములు తీసుకుని అమాయక రైతులను మోసం చేశారని ఆమె అన్నారు. వెంటనే సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని … లేదా రైతులకు భూమి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు., రైతులకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు సుహాసినీరెడ్డి..
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)