ఆ నాగ సాధువు పేరు కరుణేష్ కుమార్ శుక్లా. నాగ సాధువు అనగానే త్రిశూలం ధరించి కాషాయాంబరాలతో ఉన్న ఒక సన్యాసి మనకు గుర్తుకు వస్తాడు. కానీ కరుణేష్ కుమార్ శుక్లా సుప్రీంకోర్టు లాయరుగా హిందు ధర్మంకోసం పోరాడుతున్న నాగసాధువు. చిన్ననాటి నుండే ధార్మిక ఆలోచనలు కలిగిన కరుణేష్ వాళ్ళ కుటుంబం కూడా ధర్మాచరణ పరాయణులు కావడం కరుణేష్ కు మార్గం సుగమం చేసింది. వారి తల్లితండ్రులు తమ సంతానంలో ఒకరిని ధర్మంకోసం వదులుతామని దీక్ష తీసుకున్నారు. అలా ధర్మదీక్ష తీసుకున్నవాడు కరుణేష్.
మొదట అయోద్యలోని హనుమాన్ ఘడీలో ఒక ఆలయంలో పూజారిగా తన ధర్మదీక్షా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు కరుణేష్. ధర్మదాస్ జీ మహరాజ్ ఆధ్వర్యంలో 7సంవత్సరాలు ఆలయంలో పూజాకార్యక్రమాలు నిర్వహించాడు. హనుమాన్ ఘడీలోని సాగరియా పట్టీలోని నాగసాధు అఖాడాలో దీక్షతీసుకుని కరుణేష్ నాగసాధువుగా మారాడు. అక్కడ దాదాపు 500 మంది సాధువులు ఉండేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను నిర్వహిస్తూ ఉండేవారు.
కరుణేష్ కు ధర్మకోసం న్యాయపోరాటం చేసే బాధ్యత అప్పగించబడింది. లా పూర్తి చేసి న్యాయవాద వృత్తి చేపట్టి రామజన్మభూమిపైన న్యాయపోరాటానికి ఉద్యమించాడు. అంతే కాకుండా అనేక హిందూ విరోధ చట్టలపైన, ఖురాన్ పైన, వక్ఫ్ ఆస్తులపైన అనేక కేసులు దాఖలు చేసి సుప్రీంకోర్టులో హిందూ ధర్మం పక్షాన న్యాయపోరాటం చేస్తున్న యువకుడైన నాగసాధువు కరుణేష్ కుమార్ శుక్లా.
ఇలా మనకు తెలియకుండా ఎంత మంది ధర్మం కోసం తమ జీవితాలను అర్పించారో లెక్కేలేదు. వయస్సులో చిన్నవారైనా అటువంటి మహనీయులందరి పాదాలకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నాను.
Courtesy :- Madan Gupta