నగరవీధుల్లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ తిరుగుతున్న సల్మాన్ ఖాన్ అభిమానిని లక్నో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ సాంగ్ హర్ దిల్ జో ప్యార్ కరేగా పాటకు డ్యాన్స్ చేస్తూ లక్నో సెంటర్లోని క్సాక్ టవర్ చుట్టూ తిరిగాడతగాడు. దానికి సంబంధించిన వీడియో ఇన్ స్టాగ్రామ్ రీల్ గా వైరల్ అయింది. దీంతో ఆజం అన్సారీ అనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 30న అతను ఆ షూట్ చేస్తూ ట్రాఫిక్ జామ్ కు కారణమయ్యాడనేదీ ఆరోపణ. దీంతో అన్సారీపై సిఆర్పిసి సెక్షన్ 151 కింద కేసు నమోదు చేశారు.
వీడియోలో ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’ పాటను ప్రదర్శిస్తుండడం చూడవచ్చు. అతను సల్మాన్ ఖాన్ లాగే అర్థనగ్నంగా తన కండలు చూపిస్తూ వెళ్తున్నాడు. అతని తీరుతో ప్రయాణీకులు ఇబ్బంది పడడం కూడా గమనించవచ్చు. ఆ రీల్స్ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. రోడ్డు మధ్యలో, స్మారక చిహ్నాల ముందు, మతపరమైన ప్రదేశాలు , రైల్వే స్టేషన్‌ముందు కూడా అలాగే షూట్ చేసిన రీల్స్ ఉన్నాయి అతని ఇన్ స్టా ఖాతాలో.
లక్నోపోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత కూడా అన్సారీ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో కూడా అతని మొహంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. దీంతో నెటిజన్లు అతన్ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. జర్నలిస్ట్ సౌరభ్ శర్మ తన ఫోటోను షేర్ చేస్తూ ఇలా వ్రాశాడు, “సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పుడూ బాధపడరు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వీధుల్లో ఎక్కడైనా డ్యాన్స్ చేసినందుకు సల్మాన్ ఖాన్ అభిమాని అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు అని ట్వీట్ చేశారు.
మరో జర్నలిస్ట్ అరవింద్ చౌహాన్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ… “సెక్షన్ 151 [CrPC] కింద అరెస్టైన నవాబ్ ఆజం సాహబ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు” అని అన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 151 ప్రకారం, ఒక పోలీసు అధికారి ఒక వ్యక్తిని మేజిస్ట్రేట్ ఆదేశాలు లేకుండా మరియు వారెంట్ లేకుండా 24 గంటల వరకు అరెస్టు చేయవచ్చు మరియు నిర్బంధించవచ్చు.
ఇక ఈ సందర్భంలోనే మరో వీడియో వైరల్ అవుతోంది. అయితే ఘజియాబాద్ కు సంబంధించినది. అక్కడ ఓ స్కూల్లో దుష్యంత్ అనే యువకుడి ఇలాంటి విన్యాసాలే చేశాడు. సుశీల గర్ల్స్ ఇంటర్ కాలేజీ ముందు మే 8 న విన్యాసాలు చేసిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికలు కాలేజీ నుంచి బయటకు వస్తున్న సమయంలో దుష్యంత్ విన్యాసాలు చేశాడని ఫిర్యాదు నమోదైంది.
ఆ వీడియోను బీజేపీ నాయకుడు డాక్టర్ శలభ్ మణి త్రిపాఠీ షేర్ చేశారు. “ఈ యువకుడు పాఠశాలకు వెళ్లకుండా, షారుక్ ఖాన్‌కి అభిమానిగా మారాడు. అచ్చంగా షారుఖ్ లాగే బాలికల కళాశాలల వెలుపల విన్యాసాలు చేస్తున్నాడు. అయితే యూపీలో సీఎం యోగి అధికారంలో ఉన్నారనే విషయం మర్చిపోయాడు పాపం.. అతనికి మోరల్ ఎడ్యుకేషన్ కు సంబంబధించిన పుస్తకాలు ఇవ్వాలి… అని ట్వీట్ చేశారు.