మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. యోగీ నామినేషన్ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఆస్తిపాస్తులు, తనమీద ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు యోగీ. దాదాపు కోటిన్నర విలువైన ఆస్తులున్నట్టు అందులో వెల్లడించారు. ఇంకా 12 వేల విలువైన శాంసంగ్ మొబైల్ ఫోన్, లక్ష రూపాయల విలువైన రివాల్వర్, 80 వేల రూపాయల విలువ కలిగిన రైఫిల్ తో పాటు బంగారు చెవి రింగు, 20 వేల విలువైన రుద్రాక్షమాల తనకున్న ఆస్తులుగా యోగీ పేర్కొన్నారు. యోగీకి సొంత వాహనం, వ్యవసాయ క్షేత్రాలు లేవు. ఎలాంటి అప్పులు కూడా ఆయనకు లేవు. ఇక తనమీద ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవని అఫిడవిట్లో వివరించారు. వీటితో పాటు నాలుగేళ్ల ఆదాయ, వ్యయ వివరాల్ని యోగీ పొందుపరిచారు. ఇక ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అఖిలేష్ యాదవ్ ఆస్తుల విలువ 17.2 కోట్లు.