వైఎస్సార్టీపీ నేత షర్మిల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో పాటు.. అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలను వదిలిపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అంతవరకు దీక్ష విరమించబోనని పచ్చి మంచినీళ్లు కూడా ముట్టబోనని అంటున్నారు. లోటస్ పాండ్ దగ్గర కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తలను సైతం లోపలకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ప్రజా సమస్యలకోసం అలుపెరుగక పోరాడుతూ…పాదయాత్రద్వారా ప్రజల్లోకి వెళ్తున్న తనను చూసి సర్కారు భయపడుతోందన్న షర్మిల, పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.
https://twitter.com/realyssharmila/status/1601449949170106368?s=20&t=e0VpIxrPDez9oPMoCD1iTg