చందమామపై చంద్రయాన్ -3 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తున్న వేళ… రెండు రోజుల ముందు.. కొన్ని ఫోటోలు షేర్ చేసింది చంద్రయాన్. ల్యాండింగ్ ఘట్టానికి ఆగస్టు 23 సాయంత్రం 6.05 గంటలకు ఇస్రో ముహూర్తం కూడా నిర్ణయించింది. ఆ లోగానే భూమి వైపు నుంచి చంద్రుడి ఉపరితలంపై గుర్తించలేని కొన్ని బిలాలను ఫొటోలు తీసి పంపింది మిషన్ చంద్రయాన్. చంద్రుడి అవతలి వైపు ఉండే ఇవి భూమివైపు నుంచి కనిపించవు.
చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువైన, సురక్షిత ప్రాంతాన్ని గుర్తించేందుకు విక్రమ్ ల్యాండర్‌కు అమర్చిన కెమెరా ఈ ఫొటోలను తీసింది. ఆ ఫొటోలను విషయాలను ఇస్రో ట్విట్టర్లో షేర్ చేసింది.
చంద్రుడి అవతలివైపు సుదూరంలో ల్యాండర్ హజార్డ్ డిటెన్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా (LHDAC) బంధించిన చిత్రాలు ఇవి. సేఫ్ ల్యాండింగ్ కోసం పెద్దపెద్ద బండరాళ్లు లేదా లోతైన కందకాలు లేని ప్రాంతాన్ని గుర్తించడానికి ఈ కెమెరా ఉపయోగపడుతుంది. ఈ కెమెరాను ఎస్ఏసీ వద్ద ఇస్రో అభివృద్ధి చేసింది’’ అని ఇస్రో పేర్కొంది.