కోవిడ్ కొత్త వేరియంట్ రూపంగా ఓమిక్రాన్ గా తరుముకొస్తోంది. తాజాగా తెలంగాణలో మూడు కేసులు వెలుగుచూశాయి. మూడూ హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. హైదరాబాద్ వచ్చిన 24 ఏళ్ల కెన్యా యువకుడితో పాటు సోమాలియా జాతీయుడు ఒకరిలో ఈ వేరియంట్ గుర్తించారు. కోల్ కతా వెళ్తూ హైదరాబాద్ లో ఆగిన … మరో ఏడేళ్ల బాలుడికీ కొత్త వేరియంట్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం పశ్చిమబెంగాల్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది.
అటు ఓమిక్రాన్ ముప్పు నేపథ్యంలో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో కోవిడ్ పరీక్షల యంత్రాంగాన్ని పటిష్టం చేసింది. కేంద్రం ప్రకటించిన 11 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.