అధునాతన రవాణా వ్యవస్థలు అయినా ఓలా, ఊబర్ మీద కొత్త రకం ఫిర్యాదు కలకలం రేపుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి బుక్ చేస్తే ఒక రకం చార్జీ, ఐఫోన్ నుంచి బుక్ చేస్తే ఒక రకం చార్జీ పడుతోందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి దీనిమీద ఒక మీడియా సంస్థ ప్రత్యక్షంగా వేర్వేరు ఫోన్ ల నుంచి బుకింగ్‌లు చేసి వివరాలు బయటపెట్టింది. దీంతో ఇది సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
కొన్ని నగరాలలో ఇందుకు సంబంధించి ట్రైల్ వేశారు.
చెన్నైలోని మూడు రూట్లలో ఈ సంస్థ ప్రతినిధులు ఆండ్రాయిడ్, ఐఫోన్ల నుంచి ఒకే సమయంలో క్యాబ్‌లు బుక్ చేశారు. మూడు రూట్లలోనూ ఆండ్రాయిడ్ నుంచి బుక్ చేసిన వారి కంటే ఐఫోన్ నుంచి బుక్ చేసిన వారికి ఎక్కువ ఛార్జీ పడింది. మదిపక్కం నుంచి వెలచెరి ఫియోనిక్స్ మాల్‌కు ఆండ్రాయిడ్ నుంచి క్యాబ్ బుక్ చేస్తే రూ.195 పడగా, ఐఫోన్ నుంచి బుక్ చేసిన వ్యక్తికి రూ.260 పడింది. టీ నగర్ నుంచి ఎగ్మోర్కు ఆండ్రాయిడ్ యూజర్‌కు రూ.180 పడగా, ఐఫోన్ యూజర్‌కు రూ.344 పడింది. అవది నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు ఆండ్రాయిడ్‌లో రూ.961 పడగా, ఐఫోన్లో రూ.1,010 పడింది.
ఇటీవల మరో విషయం కూడా బయటపడింది.
ఫోన్ బ్యాటరీ పర్సంటేజీ తక్కువగా ఉన్నప్పుడు క్యాబ్ సంస్థ ఎక్కువ ఛార్జీ వసూలు చేస్తోందంటూ డిల్లీకి చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే క్యాబ్ సర్వీసులు అందించే ఉబర్ సంస్థ ఫోన్ మోడళ్ల ఆధారంగానే కాదు, అందులో ఉన్న బ్యాటరీ పర్సంటేజీ బట్టి కూడా ఛార్జీల్లో వ్యత్యాసం చూపిస్తోందని తెలిపారు.
వ్యవహారం మీద కేంద్రం సీరియస్ అయింది. ఓలా, ఊబర్ సంస్థలకు నోటీసు ఇచ్చింది.