ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టడంతో, చమురు ధరలు భగ్గుమన్నాయి. బ్యారెల్ ముడి చమురు ధర ఏకంగా 105 డాలర్లకు చేరింది. గత ఏడేళ్లలో ఇదే గరిష్టం. 2014వ సంవత్సరంలో ముడి చమురు బ్యారెల్ ధర 100 డాలర్లను అధిగమించింది.ఈ యుద్ధం వల్ల ఇంధనం తోపాటు గోధుమలు, లోహాల ధరలు పెరగనున్నాయి. ఇటీవల కరోనా లాక్ డౌన్ల తర్వాత సంక్షోభం నెలకొంది. ఈ యుద్ధం ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం కలిగిస్తుందనే ఆందోళన రేకెత్తిస్తోంది. రష్యా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు. ఇది ప్రధానంగా యూరోపియన్ రిఫైనరీలకు ముడి చమురు విక్రయిస్తుంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)