ఒడిశాలోని కటక్ నగరంలో బలిజాత్రా అనే జాతర ప్రారంభమైంది కార్తీక పౌర్ణమి నుంచి వారం రోజులపాటు నిర్వహిస్తారు. పురాతన సముద్ర-వాణిజ్య చరిత్రను తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఈ సంవత్సరం జాతర నవంబర్ 15 నుంచి 22 వరకు కొనసాగుతుంది. బాలి జాత్ర, అంటే “బలికి ప్రయాణం” అని అర్థం.
కార్తీక పూర్ణిమ సమయంలో మహానది నుండి బోయిటాస్ అనే పడవలలో వ్యాపారులు సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు. అప్పట్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పడవ మీద అంతరం మీదకు వెళ్లడం అంటే జీవితాన్ని బలి పెడుతూ ముందుకు సాగడం అన్న మాట. అంతటి సాహసం చేస్తూ సముద్ర ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. అందుచేత ఏడాదికి ఒకసారి సముద్ర ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ జాతర చేసుకుంటారు.
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఈ ఉత్సవాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రతి సాయంత్రం ఒడిస్సీ, చౌ, బిహు, మహరి, గోటిపువా, సంబల్పురి మరియు సంతాలి జానపద నృత్యాలను ప్రదర్శిస్తారు. దాదాపు 2,500 స్టాల్స్ సందర్శకుల కోసం చేతిపనులు, గృహోపకరణాలు మరియు ఆహారాలను ప్రదర్శిస్తాయి. జాతర ప్రాంగణానికి వచ్చే భక్తుల కోసం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాలి జాత్రా కటక్ ఉత్సవ్ 2024కి 14 దేశాల రాయబారులు, హైకమిషనర్లు , అనేక ఇతర దౌత్యవేత్తలు హాజరవుతున్నారు.
సముద్రతీర సంస్కృతి సంప్రదాయాలు తెలియజేస్తారు. వివిధ రకాల ఓడలు, నావలు అందులో ఉపయోగించే పరికరాలను ప్రదర్శిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాచీన నావిక విజ్ఞానాన్ని ఇక్కడ దర్శించవచ్చు.