సికింద్రాబాద్ లాలాగూడ ప్రాంతం లోని చర్చి నిర్వాకం బయట పడింది. రైల్వే ల భూమిని ఆక్రమించి చర్చి కట్టేశారు. పెద్ద ఎత్తున మత మార్పిడి లకు పాల్పడుతున్నారు.
ఎన్ని సార్లు చెప్పినా వినక పోవటం తో రైల్వే శాఖ నోటీసు ఇచ్చింది. పబ్లిక్ ఆవరణ (అనధికార ఆక్రమణదారుల తొలగింపు) చట్టం, 1971 ప్రకారం దక్షిణ మధ్య రైల్వే ఒక నెల నోటీసు జారీ చేసింది. లాలాగూడ లోని సేక్రేడ్ హార్ట్ చర్చి అక్రమ నిర్మాణం అని తేల్చింది.
డిసెంబర్ 12 లోపు అనధికారపు ఆక్రమణలో ఉన్న 3,534 చదరపు మీటర్ల స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది . అయితే, చర్చి వర్గాలు ఆ స్థలంపై తమకు చట్టబద్ధత స్పష్టంగా ఉందని, తాము ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని వాదిస్తున్నారు.
సికింద్రాబాద్ లాలాగూడ చర్చి మతమార్పిడులకు పెట్టింది పేరు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని కూలీల కుటుంబాల్లో మతమార్పిడులకు పాల్పడుతూ ఉంటారు. దీనిని
1927లో నిర్మించారు . అప్పట్లో పెద్దగా రికార్డు లేకపోవడంతో,, రైల్వేల భూమిని ఆక్రమించారు. తర్వాత కాలంలో ఈ ఆక్రమణ లను మరింత విస్తరించి అనేక భవనాలు కూడా కట్టేశారు. స్వాతంత్రం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు లౌకికవాదం ముసుగులో ఉండి చర్చిల జోలికి వెళ్ళలేదు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్రమాలను బయటకు తీయడంతో.. రైల్వే శాఖ నోటీసులు ఇచ్చింది.