ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రాధా కృష్ణుల అశ్లీల చిత్రాలను విక్రయిస్తోందని హిందూ జనజాగృతి సమితి నిన్న ఆరోపించింది. దీంతో ఆగ్రహం చెందిన ట్విట్టర్ వినియోగదారులు #Boycott_Amazon అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. జన్మాష్టమి రోజున దేవుళ్ళను అగౌరపరిచే చిత్రాలను విక్రయించడమేంటని నెటిజన్లు విరుచుకుపడ్డారు.
ఈ-కామర్స్ దిగ్గజంపై చర్య తీసుకోవాలని కోరుతూ బెంగళూరులోని సుబ్రమణ్య నగర్ పోలీస్ స్టేషన్ లో మెమోరాండం సమర్పించినట్లు హిందూ జనజాగృతి సమితి తెలిపింది. ఆ పెయింటింగ్ జన్మాష్టమి సేల్ కింద ఎక్సోటిక్ ఇండియా వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉందని పేర్కొంది. దేషవ్యాప్తంగా ఈనెల 18, 19 తేదీల్లో జన్మాష్టమిని జరుపుకున్నారు.
https://twitter.com/HJSKarnataka/status/1560611099556585474?s=20&t=AHXgmBUG3x2RAY8N8JfCsg
హిందూ జనజాగృతి సమితి ఆ తర్వాత పెయింటింగ్ ను సైట్ల నుంచి తొలగించినట్లు తెలిపింది. అయితే ఇది సరిపోదు. అమెజాన్, ఎక్సోటిక్ ఇండియా రెండూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. హిందువుల మనోభావాలను మళ్లీ దెబ్బతీయమంటూ ప్రతిజ్ఞ చేయాలని ట్వీట్ చేసింది.
దీనిపై ఎక్సోటిక్ ఇండియా సంస్థ స్పందించింది. మా వెబ్సైట్ లో అనుచితమైన చిత్రం అప్లోడ్ అయిందని మా దృష్టికి వచ్చింది. దాన్ని వెంటనే తొలగించాం. మేం హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం.. దయచేసి మా సంస్థను బాయ్ కాట్ చేయొద్దని ట్వీట్ చేసింది.
https://twitter.com/exoticindiaart/status/1560649404587331585?s=20&t=FPn1Rpw9CPA_PSETQIE46A
మీ సత్వర చర్యకు ధన్యవాదాలు. మీరు పెయింటింగ్ లను తొలగించి, బేషరతుగా క్షమాపణలు చెప్పినందుకు మేం అభినందిస్తున్నామని హిందూ జనజాగృతి సమితి రీట్వీట్ చేసింది.
https://twitter.com/HinduJagrutiOrg/status/1560686628733353985?s=20&t=FPn1Rpw9CPA_PSETQIE46A
ఈ వివాదంపై అమెజాన్ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.