ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో పవిత్రమైన చెట్టు కింద నగ్నంగా పోజులిచ్చిన రష్యాకు చెందిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు 52 లక్షల వరకు జరిమానా, ఆరేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నట్టు తెలిసింది.
17,000 మంది ఫాలోవర్లున్నయోగా ఇన్ఫ్లుయెన్సర్ అయిన అలీనా, ఇన్స్టాగ్రామ్లో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది.
దీంతో పలువురు ఆమెపై విరుచుకుపడ్డారు. పోలీసులు కల్పించుకోవాలని డిమాండ్ చేశారు. రష్యన్ బ్యూటీ స్థానికంగా Kayu Putih అని పిలిచే 700 ఏళ్ల పేపర్ బార్క్ చెట్టు ముందు నగ్నంగా నిలబడి ఉంది. స్థానిక పోర్న్ చట్టాల ప్రకారం నేరం రుజువైతే.. ఆమెకు ఆరేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఇండోనేషియాలోని బాలిలోని తబనాన్లోని బాబాకన్ ఆలయం వద్ద ఈ చెట్టు ఉంది. భారీ వృక్షాన్ని ప్రజలు పవిత్రంగా భావిస్తారు. దీంతో ఆమెపై స్థానికులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెకోసం వెదుకుతున్నారు.
విషయం తెలిసిన వెంటనే అలీనా తన ఖాతానుంచి నగ్నచిత్రాల్ని తొలగించింది. క్షమాపణ కోరుతూ మే 4న వీడియో రిలీజ్ చేసింది. ఆ చెట్టు గురించి తెలియక ఫొటోలు తీసుకున్నానని , తొందరపడినందుకు సిగ్గుగా ఉందని అంది. ఆ తరువాత పూర్తిగా దుస్తులు ధరించి ఆ చెట్టుకింద పూజలు చేస్తున్నట్టు తాజా వీడియో చేసింది. బాలీనీస్, ఇండోనేషియా ప్రజలందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను, నా చర్యలకు చింతిస్తున్నాను” అనే సందేశం ఇచ్చింది.
తెలియకుండానే పెద్ద తప్పు చేశానని..అందుకు చితిస్తున్నానని.. బాలీలో చాలా పవిత్రస్థలాలున్నాయని ఆమె అంది. అయితే వాటి ప్రత్యేకతల గురించి చాలామందికి తెలియదని ఆమె అంది. బాలిని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా. మరోసారి అందరికీ క్షమాపణలు అంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది.