రోటీని చేస్తూ అందులో ఉమ్మివేస్తున్న ఘటన మరోటి వెలుగు చూసింది.తందూరీ రోటీ చేస్తూ పిండిపై ఉమ్మివేస్తున్న నౌషద్ అనే వ్యక్తిని యూపీ మీరట్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 2, 2021 న ఓ ఎంగేజ్ మెంట్ పార్టీలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీరట్ జిల్లా కంకర్ ఖేరాలోని అంబేద్కర్ రోడ్‌లోని లక్ష్మీనగర్‌లో ఈ సంఘటన జరిగింది. అతను రోటీపైన ఉమ్ముతుంటే వేడుకకు హాజరైన ఓ వ్యక్తి వీడియో తీశాడు. మరునాడు కుటుంబ సభ్యులకు చూపించాడు. దీంతో వరుడి తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నౌషద్ తో పాటు కాంట్రాక్టర్ అయిన బాలేశ్వర్ నూ అదుపులోకి తీసుకున్నారు.
మొదట తానలా చేయలేదన్నాడు నౌషాద్. కానీ పోలీసులు వీడియో చూపించడంతో తప్పు ఒప్పుకున్నాడు. ఆరునెలల క్రితం కూడా మరో పెళ్లి నౌషాద్ ఇలాగే చేశాడని తెలిసింది. ఎప్పుడు రోటీ చేసినా ఉమ్మివేస్తాడని అతని స్నేహితులూ పోలీసులకు తెలిపారు. పెళ్లి తదితర వేడుకలకు ఆహారం సిద్ధం చేస్తూ వాటిపై ఇలా ఉమ్మివేస్తున్న ఘటనలు ఈమధ్య తరచూ వెలుగుచూస్తున్నాయి.