తెలంగాణలో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,027 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్ఐ పోస్టులు 414 , సివిల్ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్ కానిస్టేబుళ్లు 4,424, టీఎస్ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుళ్లు 5,010, స్పెషల్ పోలీస్ ఫోర్స్ 390, ఫైర్ 610, డ్రైవర్స్ 100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మే 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.tslprb.in వెబ్ సైట్ చూడండి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)