హీరో అల్లుఅర్జున్ కు తెలంగాణ ఆర్టీసీ నోటీసులు పంపింది. ర్యాపిడో సంస్థకు అల్లుఅర్జున్ చేసిన యాడ్ ఆర్టీసీ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉండడమే కారణం.సెలబ్రిటీలు కమర్షియల్ యాడ్స్ లో నటించేముందు ఓ సారి ఆలోచించాలని హితవు పలికారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అల్లుఅర్జున్ తో కానీ, ర్యాపిడ్ తో కానీ తమకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని…తమ సంస్థ ప్రతిష్ట దిగజార్చేలా ఎవరు వ్యవహించినా ఊరుకోబోమన్నారు సజ్జనార్. అల్లుఅర్జున్ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలన్నారు. నోటీసులకు స్పందించకపోతే న్యాయపరంగా ముందుకువెళ్తామనీ అన్నారు.
సినీ హీరో అల్లు అర్జున్ తక్షణమే ఆర్టీసీకి క్షమాపణ చెప్పాలని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ డిమాండ్ చేశారు.