నటుడిగానే కాక…ఉన్నతమైన వ్యక్తిత్వంతో కన్నడ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు పునీత్ రాజ్ కుమార్. చిన్న వయసులోనే కన్నుమూసిన పునీత్ ఆదర్శజీవనం గడిపాడు. అభిమానులు తనను అనుసరిస్తారని…ఆదర్శంగా తీసుకుంటారని పబ్లిక్ గా ఏనాడూ స్మోకింగ్ కూడా చేయని వ్యక్తిత్వం అతనిది. అంతే కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సొంతంగా 19 గోశాలలు, 45 పాఠశాలలు, 26 అనాథశ్రమాలు,16 వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నారు. 1800 మందికి విద్యాదానం చేశారు. మరణానంతరం కూడా మరో ఇద్దరికి వెలుగునిస్తూ తన కళ్లను దానం చేశారు పునీత్.