వక్ఫ్ సవరణ చట్టం మీద సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంటు తయారు చేసిన చట్టాన్ని మొత్తం ఆపేసిందని, మొత్తంగా స్టే ఇచ్చిందని సోషల్ మీడియాలో వాదనలు జోరు అందుకొన్నాయి. వాస్తవానికి సుప్రీంకోర్టు స్పష్టంగా కొన్ని నిజాలు మాట్లాడింది తప్పితే, ఎక్కడా షాక్ లు ఇవ్వలేదు, స్టేలు అంతకన్నా ఇవ్వలేదు.
………………………..
గత కాలపు కాంగ్రెస్ ప్రభుత్వాలు వక్ఫ్ పేరుతో దేశంలోని ఆస్తులను కొద్ది మంది ముస్లిం కుటుంబాలకు దోచిపెట్టారు. తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా భూమిని కేవలం 30 ముస్లిం కుటుంబాలు దర్జాగా అనుభవిస్తున్నాయి. లక్షలాది మంది నిరుపేద ముస్లింలకు ఈ వక్ఫ్ ఆస్తుల మీద ఎటువంటి హక్కులు లేనే లేవు. ఇటువంటి అరాచకాల మీద సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొని వచ్చింది. దీని మీద వెంటనే సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. వాటి మీద పెద్ద ఎత్తున వాదోపవాదనలు చోటు చేసుకొన్నాయి.
……
వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ ఎ.జి. మసిహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వక్ఫ్ సవరణ చట్టం మీద మొత్తంగా స్టే అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే కొన్ని నిబంధనలకు రక్షణ కల్పించాలని వెల్లడించింది.
…………
కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాం మతాన్ని ఆచరించిన వ్యక్తి మాత్రమే వక్ఫ్‌ను ప్రకటించాలి అన్న నిబంధన అవసరం లేదు అని అభిప్రాయ పడింది.
వక్ఫ్ బోర్డు ఆస్తులను నిర్ధారించే అధికారం కలెక్టర్లకు వద్దు అని చెప్పింది, దీనిని న్యాయస్థానాలు నిర్ధారిస్తాయి అని కోర్టు పేర్కొంది.
వక్ప్ పాలక మండలిలో ముస్లిమేతరుల సంఖ్య నాలుగుకి మించవద్దు అని చెప్పింది. కేంద్ర రాష్ట్రాలలోని పాలక మండళ్లకు ఈ నిబంధన వర్తిస్తుంది.
……………………………..
ఇంతకు మించి సుప్రీంకోర్టు పెద్దగా మార్పులు ఏమీ చేపట్టలేదు. వక్ఫ్ బోర్డుకి కేంద్రం తీసుకొని వచ్చిన సవరణలు శుభ్రంగా అమలు అవుతాయి. పైగా సీ ఈ వో గా కూడా ముస్లిమేతరులను నియమించుకోవచ్చు అని సుప్రీం పచ్చ జెండా ఊపింది, సాధ్యమైనంత వరకు ముస్లింలు అయితేనే మంచిది అని ఒక సలహా ఇచ్చింది.
………….
మొత్తం మీద వక్ఫ్ పేరుతో లక్షల కోట్ల రూపాలయ విలువ చేసే ఆస్తులను కేవలం 30,40 కుటుంబాలు మాత్రమే అనుభవించటం కాకుండా, లక్షలాది నిరుపేద ముస్లింలకు కూడా అవకాశం కల్పించేందుకు వక్ఫ్ సవరణలు తీసుకొని వచ్చారు. ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని సుప్రీంకోర్టు ఎక్కడా మార్చలేదు. ఈ విషయంలో తుది తీర్పు వచ్చేందుకు మరి కొంత సమయం పట్టవచ్చును