ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో నూన్ నది పునరుద్ధరణ స్ఫూర్తిదాయకమని మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కొనియాడారు. “సబ్కా ప్రయాస్” (సమిష్టి కృషి)లోని గొప్పతనాన్ని తెలియజేసిన జలౌన్ ప్రాంతవాసులకు ఆయన అభినందనలు తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ‘నూన్ నది’ పునరుద్ధరణను జరిగిన తీరు నిజంగా అద్భుతం. ఎందరికో ఆదర్శం. గ్రామస్తులు, పంచాయతీల ఉమ్మడి కృషితో అంతర్థాన స్థితిలో ఉన్న నదిని వారు పునరుజ్జీవింపచేశారు. మన్ కీ బాత్ లో మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించడంతో అందరిదృష్టీ యూపీలోని జలౌన్ పై పడింది.