విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా నామినేషన్ వేశారు. ఎన్సీపీ నేత శరద్ పవార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు ఆమె వెంట ఉన్నారు.అయితే టీఆర్ఎస్ అల్వా నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉంది. ఇంకా ఏయే పార్టీలు ఆమెకు మద్దతిస్తున్నాయనే విషయంలో స్పష్టత రావల్సి ఉంది. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ సోమవారం ప్రధాని సమక్షంలో నామినేషన్ వేశారు. ఇవాళే నామినేషన్లకు తుదిగడువుకాగా..ఆగస్టు 6న ఎన్నిక జరగనుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి పదవీకాలం ఆగస్టు 10 న ముగియనుంది.
#WATCH | Opposition's Vice-Presidential candidate Margaret Alva files her nomination papers at Parliament, in the presence of Congress leaders Rahul Gandhi, Mallikarjun Kharge & Adhir Ranjan Chowdhury, NCP chief Sharad Pawar, Shiv Sena's Sanjay Raut and other Opposition leaders. pic.twitter.com/oHmMvB6ij3
— ANI (@ANI) July 19, 2022
ఇక ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్కర్ సోమవారం నాడే ప్రధాని మోదీ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు ఇవాళే తుది గడువు కాగా, ఆగష్టు 6న దేశ 14వ ఉపరాష్ట్రపతి కోసం ఎన్నిక జరగనుంది. ఆగష్టు 10న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది.