స్వాతంత్య్ర సమరంలో గత నాయకుల పాత్రపై అధికార బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ కు నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మాటల యుద్ధం జరుగుతోండగా శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో వినాయక్ దామోదర్ పాత్రను ఎవరూ విస్మరించలేరని.. కానీ భారతదేశం మహాత్మా గాంధీ శక్తి, సూత్రాలపై నడుస్తుందని అన్నారు.
భారత స్వాతంత్య్ర పోరాటంలో సావర్కర్ పాత్రను ఎవరూ విస్మరించలేరు… ప్రస్తుతం మనం ఒకరిని తక్కువ లేదా ఎక్కువగా చిత్రీకరించడం మానుకోవాలి, ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల ప్రతి సహకారం మనకు లభించిన స్వాతంత్య్రంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని చతుర్వేది అన్నారు.
మీరు మహాత్మా గాంధీని ద్వేషించవచ్చు.. గాడ్సే ను మాత్రమే గౌరవించవచ్చు, కానీ మన దేశం మహాత్మా గాంధీ శక్తి, సూత్రాలపై నడుస్తుందని ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రధాని మోదీ గాంధీ పేరును ప్రస్తావిస్తున్నారంటే.. ఆయన గాంధీ మార్గాన్ని కూడా అనుసరిస్తారని ఆశిస్తున్నానని ప్రియాంక అన్నారు.
https://twitter.com/ANI/status/1559186536024793089?s=20&t=ICo987Ui8i1Mx4xm7STS0A
కర్ణాటకలో హర్ ఘర్ తిరంగ ప్రకటన నుంచి నెహ్రూ ఫోటోను బీజేపీ తొలగించిన తర్వాత కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రభుత్వ చర్యపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ప్రియాంక చతుర్వేది ఈ వ్యాఖ్యలు చేశారు.