భారత్ రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే అంశం – రష్యాపై విధించిన ఆంక్షల్ని ఉల్లంఘించదని అమెరికా స్పష్టం చేసింది. అలాగే ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించవద్దని మరో సారి కోరారు. ప్రతీ దేశం తమ ప్రయోజనాల కోసం అడుగు వేస్తోందని అన్నారు వైట్ హైస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకీ. సోమవారం భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ వర్చువల్ మీట్ ద్వారా సమావేశమైన సంగతి తెలిసిందే. అంతకన్నా ముందు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధులతో (2+ 2′) చర్చలు జరిపారు.
రష్యా-ఉక్రెయిన్ వార్, రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడం సహా ఇతర ప్రపంచ సమస్యలపై చర్చించారు. సమావేశం అనంతరం, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి ఇంధన దిగుమతులను పరిమితం చేయాలని జో బిడెన్ భారత్‌ను కోరారా అని అడిగిన ప్రశ్నకు అలాంటిదేం లేదని… భారత్ ఆ దేశం నుంచి ఇంధన దిగుమతిపై తాము ఆంక్షలు విధించలేదని వివరణ ఇచ్చారు. భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం ఇందనంలో 1 నుంచి 2 శాతం వరకు మాత్రమే ఉన్నందువల్ల ఆంక్షలను ఉల్లంఘించినట్లు పరిగణించడం లేదని తెలిపింది. రష్యా నుంచి ఇంధన దిగుమతులను పెంచుకోవడం భారత దేశ ప్రయోజనాలకు సరికాదని మోదీకి బైడెన్ చెప్పారని ఆయన అన్నారు. అదే సమయంలో భారత్ ఇంధన దిగుమతి చేసుకునేందుకు అవకాశాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్టు అమెరికా తెలిపింది. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న దానికంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇంధన పరిమాణమే ఎక్కువ అని ఆ దేశం అంది.
భారత్ ఇంధన దిగుమతి చేసుకునేందుకు అవకాశాలను పెంచడానికి అమెరికా సిద్ధంగా ఉందని మోదీకి బైడెన్ చెప్పారన్నారు. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న ఇంధనం కన్నా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇంధనం చాలా ఎక్కువ అని తెలిపారు. జెన్ ప్సాకి సమాధానంతో అమెరికా విధానంలో భారీ మార్పు వచ్చినట్లు స్పష్టమవుతోంది.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)