తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
లాక్ డౌన్ విధించే విషయంలో గత అనుభవాలతో పాటు ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు ఇతర రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. లాక్డౌన్ విధించడం వల్ల కొవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గడం సంగతి అటుంచితే, ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనీ అన్నారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం రాత్రి ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, కరోనా రోగులకు అందిస్తున్న చికిత్స, కొవిడ్-19 వ్యాక్సినేషన్, కొవిడ్-19 వ్యాక్సిన్ నిల్వలు, ఆక్సీజెన్ నిల్వలుపైనే సమీక్షలో చర్చించారు.