నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తామని జనతాదళ్ యునైటెడ్ ఈరోజు ప్రకటించింది. ఈ పదవికి ద్రౌపది ముర్ము పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న ప్రకటించారు.
ఎన్డీయే తరపున రాష్ట్రపతి పదవికి ద్రౌపది ముర్ము పోటీ చేయడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ఎంపిక గురించి నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ తనకు తెలియజేశారని చెప్పారు.
‘‘ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా నిలవడం ఆనందంగా ఉంది. ఆమె గిరిజన మహిళ, గిరిజన మహిళ దేశ అత్యున్నత పదవికి నామినేట్ కావడం చాలా సంతోషకరమైన విషయం. ఆమె ఒడిశా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, ఆపై జార్ఖండ్ గవర్నర్ గా కూడా పని చేశారు. నిన్న ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా చేస్తున్నట్టు ప్రధాని తెలియజేశారు. ఇందుకు ప్రధానమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు” అని నితీష్ కుమార్ ట్వీట్ చేశారు.
“ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని జనతాదళ్ యునైటెడ్ స్వాగతిస్తుంది, తనకు మా పూర్తి మద్దతు ఉంది” అని లాలన్ సింగ్ ట్వీట్ చేశారు.